నిర్మాతగా మారుతోన్న మహానటి

4
keerthi suresh update
keerthi suresh update

keerthi as producer

నిర్మాణం ఇప్పుడు చాలా పెద్ద రిస్క్ అయింది.. ఎన్నోయేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ.. వస్తోన్న మార్పులను తట్టుకోలేకో లేక హీరోస్వామ్యాన్ని సహించలేకో చాలామంది నిర్మాతలు నిరంతరం చెబుతోన్న మాట ఇది. నిజమే.. ఒకప్పుడు విలువలకు పెద్ద పీట వేశారు. ఇప్పుడు హీరోలకు వేస్తున్నారు. ఏ ఇండస్ట్రీ చూసినా నిర్మాతలు కేవలం చెక్ పేపర్స్ గా మాత్రమే మారిపోయారు. అంతకు మించి వారికే విలువా లేదు. అలాంటివన్నీ వదులుకుంటేనే ఇక్కడ నిర్మాతలుగా పేరు సంపాదిస్తున్నారు చాలామంది. అలాంటి తరుణంలో ఓ తరుణిగా తానూ నిర్మిస్తాను సినిమాలు అంటూ ముందుకు వస్తోందట మహానటి ఫేమ్ కీర్తి సురేష్. చాలా తక్కువ టైమ్ లోనే తనకంటూ ఓ గొప్ప క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ కీర్తి సురేష్.. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉన్నా గ్లామర్ పాత్రల్లోనూ రాణిస్తోన్న నటి తను. మహానటి తర్వాత తన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. కొందరు రెగ్యులర్ హీరోయిన్ గా కష్టం అని కూడా అన్నారు. అయినా అందరినీ దాటుకుని తనదైన శైలిలో దూసుకపోతోంది. ప్రస్తుతం తన చేతిలో అరడజను వరకూ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఆశ్చర్యమేం లేదు.

అంటే హీరోయిన్ గా ఎవరెన్ని అనుకున్నా తను మాత్రం చాలా బిజీగా ఉందనే కదా అర్థం. మరి హ్యాపీగా సినిమాలు చేసుకోకుండా కీర్తి సురేష్ కూడా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనుకుంటోందట. ఇప్పటికే సౌత్ లో చాలామంది సీనియర్ అండ్ యంగ్ హీరోలు నిర్మాణ సంస్థలు మొదలుపెట్టారు. వీరిలో చాలా తక్కువమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అంటే రిస్క్ ఉందనే కదా అర్థం. అయినా కీర్తి సురేష్ నిర్మాతగా మారేందుకు సిద్ధమైందట. ముందుగా ఓ వెబ్ సిరీస్ నిర్మించాలన్న ఆలోచనలో ఉంది ఈ భామ. విషయం ఏంటంటే.. ఇదేమీ రూమర్ కాదు. ఆల్రెడీ తను అందుకు సంబంధించిన పనులు కూడా పూర్తి చేసుకుందట. పూర్తిగా తమిళ్ లోనే ఉండే ఓ వెబ్ సిరీస్ తో కీర్తి సురేష్ నిర్మాతగా మారుతోంది. మరి తను ఎలాంటి కథ ఎంచుకుంది.. నిర్మాతగా ఎలా రాణిస్తుంది అనేది చూడాలి.

tollywood news