కీర్తితో 40యేళ్ల సినిమాకు సీక్వెల్

4
keerthi suresh update
keerthi suresh update

keerthi new cinema

నలభైయేళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా సీక్వెల్ రాబోతోంది. అప్పట్లో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. రొటీన్ సినిమాలు చేస్తున్నాడని ఆ దర్శకుడిపై వచ్చిన విమర్శలకు సమాధానంగా వచ్చిన చిత్రమే అది. అలాంటి మూవీకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ వస్తుందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అంతకంటే సర్ ప్రైజింగ్ మేటర్ ఏంటంటే.. ఈ మూవీలో మహానటి బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తుండటం.ఎర్ర గులాబీలు.. సౌత్ ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ భారతీరాజా రూపొందించిన సినిమా. అప్పటి వరకూ రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ తోనే ఆకట్టుకున్న భారతీరాజాపై అతను మెట్రో తరహా సినిమాలు చేయలేడు. ఇలా విలేజ్ లకే పరిమితం అనే విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలకు సమాధానంగా వచ్చిన చిత్రమే ఎర్ర గులాబీలు. అప్పటి వరకూ ఉన్న భారతీరాజా స్టైల్ కు భిన్నంగా వచ్చిన ఈమూవీలో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించారు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా ఉన్న వ్యక్తిలోని ఎవరికీ తెలియని ఓ డార్క్ సైడ్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చిన ఈమూవీ తమిళ్ లో సిగప్పు రోజాక్కల్ గా.. తెలుగులో ఎర్రగులాబీలుగా విడుదలై రెండు చోట్లా సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీకే ఇప్పుడు సీక్వెల్ రాబోతోందంటోంది కోలీవుడ్. భారతీరాజా కథల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ స్క్రీన్ పై భారతీరాజా ముద్ర ప్రత్యేకం. తెలుగులోనూ సీతాకోక చిలుక, ఈ తరం ఇల్లాలు, ఆరాధన వంటి మెమరబుల్ మూవీస్ అందించారు. అలాగే ఆయన తమిళ్ లో డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ అయి మంచి విజయాలు అందుకున్న సందర్భాలూ అనేకం ఉన్నాయి. అలాంటి దర్శకుడు ఇన్నేళ్ల తర్వాత తన సినిమాకు కొత్తతరం ప్రేక్షకులను అనుగుణంగా కథను రాయడం విశేషం. ఇక ఈ సినిమాకు కీర్తి సురేష్ ఆల్రెడీ ఓకే చెప్పింది . అలాగే ఈ సారి భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా దర్శకుడుగా ఇంటర్ డ్యూస్ అవుతున్నాడు. ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న బ్యూటీ ఎవరైనా ఉంటే అది కీర్తి సురేష్ అనే చెప్పాలి. ఇప్పటికే తన చేతిలో ఐదారు సినిమాలున్నాయి. ఓటిటిలో ఫస్ట్ డెబ్యూ మూవీ తనదే అయింది. సినిమా పోయినా తన నటనకు అద్భుతమైన మార్కులు పడ్డాయి. అలాంటి తను ఈ సినిమాలో నటించబోతుండటం ఖచ్చితంగా దర్శకుడికి ప్లస్ పాయింట్ అవుతుందనే చెప్పాలి. అయితే ఈ సారి ఫిమేల్ ఓరియంటెడ్ కథగా రాశాడట భారతీరాజా. పైగా ఇది రివెంజ్ స్టోరీ అంటున్నారు. టైటిల్ అదే ఉంటుంది. భారతీరాజానే నిర్మిస్తోన్న ఈమూవీకి మళ్లీ ఇళయరాజానే మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఇతర ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే సెట్స్ పైకి వెళుతుందట. మరి అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈచిత్రం ఆ సారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

tollywood news