కీర్తి సురేష్ ఎవరినీ లెక్క చేయడం లేదు

3
keerthi suresh update
keerthi suresh update

keerthi suresh update

గ్లామర్ క్వీన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలుగుతుంది అనుకున్న బ్యూటీ కీర్తి సురేష్. కానీ తన వయసుకు మించిన పాత్రలతో యువతరంలో కొంత క్రేజ్ కోల్పోయింది. అయినా మహానటితో వచ్చిన కీర్తి మాత్రం కీర్తికి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాగే పెంగ్విన్ సినిమాలో తనలోని మరో గొప్ప నటిని చూపించేందుకు ఏకంగా రెండు పెళ్లిల్లు, ఒక  కొడుకు వంటి చాలా పెద్ద తరహా పాత్రనే పోషంచింది. దీంతో యువ హీరోలు సైతం కీర్తి గురించి పెద్దగా ఆలోచించడం లేదు అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట. విశేషం ఏంటంటే.. తనూ పెద్దగా ఆ వైపు ఆలోచించడం లేదు. అందుకే అన్ని సినిమాలూ చేసేస్తోంది. ప్రస్తుతం తన చేతిలో ఏకంగా అరడజను ప్రాజెక్ట్స్ వరకూ ఉన్నాయంటే కారణం తనూ సీరియస్ గా బిగ్ స్టార్ గా వెలిగే కంటే గొప్ప నటి అనిపించుకునే ప్రయత్నాల్లో ఉండటమే. కాకపోతే ఎంత కాదనుకున్నా.. రెగ్యులర్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో సంపాదించే క్రేజ్ లెవెల్ వేరేగా ఉంటుంది. ఆ లెవల్ తనకు తెలుగులో మరోసారి రంగ్ దే తెస్తుంది అనుకుంటోంది కీర్తి సురేష్. నితిన్ సరసన రంగ్ దేలో నటిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కూడా చాలా ప్రాధాన్యతతో ఉంటుందని ఇంతకు ముందే చెప్పారు.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ తనకు యువ హీరోల్లో మళ్లీ క్రేజ్ తెస్తుందనే నమ్మకంతో ఉంది కీర్తి సురేష్. స్కిన్ షోకు చాలా దూరం ఉండే కీర్తి గ్లామర్ విషయంలో మరీ ఏమంత గిరిగీసుకుని లేదు. మోతాదు మించని విధంగా ఉంటే ఓకే అంటోంది కూడా. ఇక రంగ్ దే విషయానికి వస్తే .. లాక్ డౌన్ కారణంగా చివరి షెడ్యూల్ ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా కారణంగా చాలామంది తారలు భయపడుతున్నారు. అయినా కీర్తి మాత్రం ఎవరినీ లెక్క చేయను అంటూ షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తోంది. మొన్నా మధ్య గుడ్ లక్ సఖి షూటింగ్ లో పాల్గొంది. ఇప్పుడు రంగ్ దే కోసం కూడా రెడీ అంటోంది. రీసెంట్ గానే తను హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. కరోనా వల్ల మరీ బయటకు వెళ్లకుండా ఓ భారీ సెట్ వేశారీ చిత్రం కోసం. కీర్తితో పాటు నితిన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఏదేమైనా హీరోలతో పోలిస్తే హీరోయిన్లే బెటర్. కీర్తి సురేష్ తర్వాత మొన్నా మధ్య పూజాహెగ్డే కూడా షూటింగ్ లో పాల్గొంటోంది.

tollywood news