వంద మొక్కలు నాటాల్సిందిగా హైకోర్టు శిక్ష  

Kerala HC Orders Bureaucrat to Plant 100 Saplings

ఓ అధికారికి కేరళ హైకోర్టు వేసిన శిక్ష ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఒక ప్రైవేటు కంపెనీ పెట్టుకున్న అప్పీలుపై తగిన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం, నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ.. పరిశ్రమల శాఖ డైరెక్టర్ కె.బిజును వంద మొక్కలు నాటాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు మొక్కలు నాటాల్సిందిగా ఆదేశించిన ఐఏఎస్ ఆఫీసర్ కె.బిజు.. ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి కె.కృష్ణకుట్టి కుమారుడు కావడం గమనార్హం. బిజు 2006 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆఫీసర్.

కె.బిజును వంద మొక్కలు నాటటమే కాకుండా  ఎక్కడెక్కడ, ఏమేం మొక్కలు నాటారన్న వివరాలను కూడా తమకు అందజేయాలని స్పష్టం చేసింది.కేరళలోని కోల్లాం ప్రాంతానికి చెందిన ఎస్ఎస్ కెమికల్స్ అనే కంపెనీ లైసెన్సు కోసం 2016లో పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకుంది. ఇన్నేళ్లయినా దానిపై ఏమీ తేల్చకపోవడంతో ఆ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. పరిశ్రమల శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లైసెన్సు ఇస్తారా, లేదా అన్నదానిపై మూడున్నరేళ్లుగా నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ బిజు నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాకుండా పబ్లిక్ ప్రదేశాల్లో వంద మొక్కలు నాటాలని.. ఆ వివరాలను తమకు అందజేయాలని స్పష్టం చేసింది. కేరళ హైకోర్టు  అతనికి చిత్రమైన శిక్ష వేసింది.

Kerala HC Orders Bureaucrat to Plant 100 Saplings,kerala , biju , private industry , appeal, industrial department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *