ఆర్టీసీ విలీనం , కొత్త ఇసుక పాలసీ ఆమోదం .

Key Decision On Andhra Pradesh Cabinet

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆంజనేయరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది. రూ.375కు టన్ను ఇసుక ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజలు ఆన్‌లైన్లో కూడా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. సొంత ఆటోలు, ట్యాక్సీలు ఉండి, వాటిని నడుపుకొనే వారికి ప్రభుత్వం వరాలు కురిపించింది. వారికి ఏటా రూ.10వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఖజానాపై రూ.400 కోట్ల భారం పడనుంది.ఏపీఎస్ ఆర్టీసీని రవాణాశాఖలో విలీనానికి ఆమోదం తెలిపింది .ఇక నుండి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను పబ్లిక్‌ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకుంటారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కలిపించి మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చెయ్యాలని నిర్ణయించింది క్యాబినెట్ . పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు చేశారు. ఇక ఇది ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుంది.స్వతంత్ర ప్రతిపత్తిగల బస్ చార్జీల నియంత్రణ మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది క్యాబినెట్ . దీంతో రూ.3300 కోట్ల ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం చేపట్టనుంది.

ఇక కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 13 జిల్లాల్లో 41 ఇసుక స్టాక్ పాయింట్లు ఇప్పటికే సిద్ధం కాగా అక్టోబర్ చివరి నాటికి 80 వరకు పెంచే చర్యలు తీసుకోనున్నారు. టన్ను ఇసుక రూ.375. ఒక టన్నుకు, కిలోమీటర్‌కు రవాణా ఖర్చు రూ.4.90. పది కిలోమీటర్ల లోపు ఉంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చెయ్యనున్నారు. రైతుల పట్టా భూముల్లో ఇసుక ఉంటే, దాన్ని క్యూబిక్ మీటర్‌కు రూ.60 చెల్లించి ఏపీఎండీసీ కొనుగోలు చేస్తుందని నిర్ణయించింది క్యాబినెట్ . ప్రజలు ఆన్‌లైన్లో కూడా ఇసుకను బుక్ చేసుకోవచ్చు అంతేకాదు ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సొంతంగా ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు ఉన్నవారికి ఏటా రూ.10వేల సాయం (భార్య – భర్త ఒక యూనిట్‌గా లెక్కిస్తారు. మేజర్ అయిన కూతురు లేదా కొడుక్కి కూడా సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉంటే వారికి కూడా ఏటా రూ.10వేలు) ఇవ్వటానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

India Series Against Windies

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *