అయోధ్య తీర్పు నేపధ్యంలో రైల్వే భద్రత పై కీలక నిర్ణయాలు

Key decisions on railway safety

అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఇక దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను టార్గెట్ చేస్తూ, లేదా రైళ్లను టార్గెట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందుగానే రైల్వే పోలీసులను అన్ని రైల్వే స్టేషన్లలో నూ భద్రతా చర్యలు చేపట్టాలని రైల్వే అడ్వైజరీ కమిటీ  సూచించింది . అయోధ్య తీర్పు రానున్న నేపధ్యంలో రైళ్ళ శాఖ రైల్వే రక్షణ కోసం ఏడు పేజీల లేఖను రాసింది.  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సలహా మేరకు  అయోధ్య వివాదం కేసు తీర్పు త్వరలో రానున్న నేపథ్యంలో రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బంది అందరికీ  సెలవులు రద్దు చేసినట్లుగా పేర్కొంది. అంతేకాదు ఎస్కార్ట్ సిబ్బంది రైళ్లలో అత్యంత జాగ్రత్తతో,  విధుల్లో నిమగ్నమై పనిచేయాలని ఆదేశించినట్లు గా పేర్కొంది. రైల్వే స్టేషన్లు, రైల్వే ప్లాట్ ఫామ్ లు,యార్డ్,  పార్కింగ్ స్థలాలు,వంతెనలు,  వర్క్ షాప్ లు,ఉత్పత్తి యూనిట్లు, సొరంగాలు  ఇలా ప్రతి చోటా భద్రతా అంశాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సూచించింది.ఎక్కడ ఎలాంటి హింసకు అవకాశం లేకుండా  కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని,ఎలాంటి పేలుడు పదార్థాలు,హింసాత్మక ఘటనలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ కమిటీ పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ  నవంబర్ 17న చేయనున్న నేపథ్యంలో ఈ లోపు అయోధ్య వివాదం పై తీర్పు వెలువరిస్తారని  భావిస్తున్న పరిస్థితి ఉంది.  అందుకే  ముఖ్యంగా ఎలాంటి  ఉద్రిక్త పరిస్థితుల్లో అయినా  రైళ్లను, రైల్వేస్టేషన్లను టార్గెట్ గా  చేసుకుంటారు కాబట్టి  రైల్వేశాఖ  పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక అంతే కాకుండా  రైల్వే స్టేషన్లకు సమీపంలో ఉన్న  అన్ని మత నిర్మాణాలపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలని,అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. అయోధ్య వివాదం తీర్పు వస్తున్న నేపథ్యంలో మతతత్వ ఘర్షణలకు ఎక్కువ అవకాశం ఉన్న కారణంగా  అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా  సదరు నిర్మాణాలను కాపాడడమే కాకుండా తద్వారా రైల్వే ఆస్తులకు కానీ, మనుషుల  ప్రాణాలకు కానీ ఎలాంటి హాని కలగకుండా ఉండాలని సూచనలు చేసింది. ముంబై,ఢిల్లీ,మహారాష్ట్ర మరియు ఉత్తర ప్రదేశ్  రాష్ట్రాలతో పాటు  మిగతా రాష్ట్రాలలోని 78 ప్రధాన రైల్వే స్టేషన్లను గుర్తించిన  రైల్వే శాఖ  అక్కడ భద్రతను మరింత పెంచింది.
tags: Ayodhya verdict,Supreme Court, central government,  Ranjan Gogoi, RPF, Raiway protection force, mumbai, delhi, uttar pradesh

రెవెన్యూ అధికారులు ఆ ఎమ్మెల్యేను వేధిస్తున్నారట

తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో కీలక మలుపులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *