తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో కీలక మలుపులు

 Key turning point in the case of Tehsildar Vijayaraddy

తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో ఆసక్తికర విషయాలు  వెలుగులోకి వస్తున్నాయి.  ఈ కేసును సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి సజీవ దహనానికి సంబంధించి  దర్యాప్తు కొనసాగిస్తున్నారు సిట్  బృందం. తహసీల్దార్ విజయారెడ్డి  హత్యకు వివాదాస్పద భూముల కారణమనే వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నేతల హస్తం ఉందని భావించిన సిట్ బృందం, పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును  ముమ్మరం చేశారు. ఇక ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు  విజయారెడ్డిపై దాడికి ముందు ఆమె ఇంటి వద్ద నిందితుడు సురేష్ రెక్కి నిర్వహించినట్లు  ఆధారాలు లభించాయి. ఘటనకు రెండు రోజుల ముందు విజయారెడ్డి ఇంటి దగ్గర ఆమె భర్తతో సురేష్ మాట్లాడినట్లు పోలీసులు ఆధారాలు సైతం సేకరించారు.  సురేష్ విజయారెడ్డి ని ఇంటి వద్దే చంపాలని  భావించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.  అయితే విజయారెడ్డి ఇంటికి వెళ్ళిన సురేష్  ఆమె భర్త సుభాష్ రెడ్డి తో ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు అన్న దానిపై  పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక  విజయా రెడ్డి ఇంటికి వెళ్లే ముందు  సురేష్ తన స్నేహితులతో ఈరోజు తాడోపేడో తేల్చుకుంటామని మాట్లాడినట్లుగా  తెలుస్తుంది. ఇక ఆ తర్వాత తహసిల్దార్ కార్యాలయంలో  విజయారెడ్డి ని సజీవదహనం చేసి,  తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సురేష్  తీవ్రగాయాలతో రోడ్డు పైకి వెళ్ళాడు.  అక్కడ రోడ్డుపై ఆగివున్న  కారులో ఉన్న వ్యక్తులతో సురేష్ మాట్లాడినట్లుగా  సిసిటివి ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది.  ఇంతకీ కారులో ఉన్న వ్యక్తులు  ఎవరు?  సురేష్ వారితో  ఎందుకు మాట్లాడాడు ..ఏం మాట్లాడాడు అన్నది దర్యాప్తు చేసే పనిలో పడ్డారు పోలీసులు. అయితే వైన్‌ షాపు సమీపంలో కారులోని వ్యక్తులతో మాట్లాడిన నేపధ్యంలో కారులో ఉన్న వ్యక్తులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. తర్వాత కారు ఎటు వెళ్లిందనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు. కారులోని వ్యక్తులను విచారిస్తే కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మేజిస్ట్రేట్‌ నుంచి సురేశ్‌ వాంగ్మూలం పోలీసులకు అందనుంది. వాంగ్మూలం, కాల్‌డేటా కేసులో కీలకంగా మారనుంది. హత్యకు వారికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు.ఇక సురేష్ భార్య చెప్పిన విషయాలు సైతం కేసులో ఆసక్తికరంగా మారాయి.తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసులో  సురేష్ అలా ఎందుకు చేశాడో తమకు తెలియదని, తన భర్తను ఎవరో పావుగా వాడుకున్నారని సురేష్ భార్య  లత కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
tags : tahasildar vijayareddy, burnt alive, SIT, police,cc tv footage, car, unknown persons, suresh

రెవెన్యూ అధికారులు ఆ ఎమ్మెల్యేను వేధిస్తున్నారట

టీడీపీకి షాక్ ఇవ్వనున్న సాధినేని యామిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *