తెలంగాణలో యూపీ తరహా దారుణాలు

4
Khammam rape case victim
Khammam rape case victim

Khammam rape case victim

దళిత బాలికపై వివక్ష

సర్కార్ ఎందుకు ఆలస్యం చేస్తోంది

యశోదలో ట్రీట్ మెంట్ ఎందుకు ఇప్పించరు

‘‘తెలంగాణ రాష్ర్టం శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహిళల రక్షణకు మరింతగా శ్రమిస్తున్నాం’’ సీఎం కేసీర్ వ్యాఖ్యలివి. కానీ కేసీఆర్ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇందుకు ఉదాహరణే ఖమ్మం బాలికపై అత్యాచార ఘటన. అత్యాచారానికి గురై ఆపై జరిగిన పెట్రోల్ దాడిలో దాదాపుగా 70శాతం కాలిన దేహంతో  బాలిక చికిత్స పొందుతోంది. ఈ విషయమై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. సీరియస్​గా ఉన్న దళిత అమ్మాయికి యశోద, అపోలో వంటి దవాఖానాల్లో సర్కార్ ఎందుకు ట్రీట్ మెంట్ ఇప్పించడం లేదని ప్రజలు అంటున్నారు. దారుణానికి గురైన13 ఏండ్ల అమ్మాయికి న్యాయం చేయలేని ప్రభుత్వం ఉండి ఎందుకని మండిపడుతున్నారు. దారుణానికి గురైన దళిత అమ్మాయి పట్ల ఇంత వివక్ష చూపిస్తారా అని టీఆర్​ఎస్​ సర్కార్​పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దారుణం జరిగి 18 రోజులు అవుతోంది. సర్కార్​ నుంచి బాధిత కుటుంబానికి ఏ సాయం కూడా అందలేదు.

రహస్య ట్రీట్ మెంట్ ఎందుకు?

ఖమ్మం బాధిత బాలిక విషయంలో సర్కార్​ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నయి. రాష్ర్టంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని  ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 75 శాతం గాయాలతో విషమపరిస్థితిలో ఉన్న బాలికను బెటర్​ ట్రీట్​మెంట్​ కోసం ప్రభుత్వం కార్పొరేట్​ హాస్పిటల్లో చేర్పించకపోవడంపై మండిపడుతున్నారు. ఓ పేదింటి బాలిక రక్షణ బాధ్యత సర్కార్​ది కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగిన తరువాత కూడా కేసు పెట్టవద్దంటూ పంచాయితీ పెట్టిన పెద్ద మనుషులు అందరిని అరెస్ట్ చేయాలన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా15 రోజులపాటు సీక్రెట్‌‌గా ట్రీట్‌‌మెంట్ అందించిన పూజ హాస్పిటల్‌‌ లైసెన్స్‌‌ను రద్దు చేసి, మేనేజ్‌‌మెంట్‌‌ను అరెస్ట్ చేయాలంటున్నారు

బాలిక పరిస్థితి విషమం

ఖమ్మం అత్యాచార యత్నం ఘటనలో 70 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. శరీరం లోపలి భాగాలు బాగా కాలిపోవడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు కూడా చెప్పారు.

విమర్శలు వెలువెత్తడంతో…

ఉస్మానియా హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు ఉప్పలయ్య, నర్మమ్మల విజ్ణప్తి మేరకు అమ్మాయిని రెయిన్ బో హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని శిశు సంక్షేమ , గిరిజన సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అయితే బాలికపై దాడి జరిగి రోజులు గడుస్తునా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని వివిధ పార్టీల నాయకులు విమర్శించారు. తెలంగాణలో యూపీ తరహ దారుణాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ఘటనపై హెచ్ఆర్సీ కూడా సీరియస్ అయ్యింది. పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారంటూ ప్రశ్నించింది.