పవన్ కళ్యాణ్ సరసన కియారా..?

Kiara Advani Acts In Pawan Kalyan Krish Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వేగంగా సినిమాలు కదుపుతున్నాడు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేయడమే కాదు.. ఏ మాత్రం బద్ధకించకుండా.. షూటింగుల్లో కూడా పాల్గొంటున్నాడు. పింక్ రీమేక్ లాయర్ సాబ్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ జరుగుతూనే ఉంది. లేటెస్ట్ గా క్రిష్ డైరెక్షన్ లో సినిమా ప్రారంభం అయింది. ఈ ప్రారంభ సన్నివేశాల్లో పవన్ కళ్యాణే నటించడం విశేషం. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీలో పవన్ ఓ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడట. అంటే పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచడం అన్నమాట. ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏదైనా ఉంటుందా అనే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఓ ఖచ్చితమైన కమర్షియల్ హిట్ కోసం చూస్తోన్న క్రిష్ ఈ అవకాశాన్ని వాడుకునేందుకే కియారా వంటి స్టార్ బ్యూటీని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట.

తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనేనేనుతో పరిచయం అయి.. తన అందంతో అందరినీ ఫిదా చేసిన ఈ భామ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయరామ్ లో కూడా నటించింది. కానీ అదే టైమ్ లో తనకు లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ తో పాటు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లతో బిగ్గెస్ట్ హిట్స్ రావడంతో బాలీవుడ్ ఫుల్ బిజీ అయింది. దీంతో మళ్లీ తెలుగులో ఎంతమంది అడిగినా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే వదులుకుంటుందా అంటే మాగ్జిమం కోదు అనే చెప్పాలి.
ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన కియారాను తీసుకునేందుకు క్రిష్ తన బాలీవుడ్ పరిచయాలను అన్నీ ఉపయోగిస్తున్నాడట. ఏదేమైనా ఈ మూవీలో కియారా ఒప్పుకుంటే తనకూ మళ్లీ ఓ కమ్ బ్యాక్ మూవీ అవుతుందనే చెప్పాలి.

Kiara Advani Acts In Pawan Kalyan Krish Movie,#Kiara Advani,#Pawan Kalyan,#Krish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *