కిల్లీకృపారాణికి జగన్ బంపర్ ఆఫర్ ?

Spread the love

Killi Kruparani Jagan bumper offer

ఉత్తరాంధ్ర నేత కిల్లీకృపారాణికి జగన్ రాజ్య సభ సభ్యురాలిగా అవకాశం ఇస్తారని టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన కిల్లి కృపారాణికి రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది . ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్న రాజకీయ పరిస్థితులు కిల్లీకృపారాణికి సానుకూలంగా ఉన్నాయన్న కారణమే జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకోవటానికి కారణం అని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగానూ, కేంద్ర మంత్రిగానూ పనిచేసిన కిల్లి కృపారాణి, గత ఎన్నికలకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం నుండి ఎంపీగా కానీ, టెక్కలి ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరిన ఆమెకు జగన్ ఏ అవకాశం ఇవ్వలేదు . అప్పటికే ఆయా స్థానాలలో పార్టీ ఇంచార్జ్ గా పనిచేస్తున్న వారికి టికెట్లు ఇస్తానని జగన్ చెప్పిన నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇవ్వలేదు జగన్. అయినప్పటికీ కిల్లి కృపారాణి వైసిపి కోసం పని చేశారు. ప్రస్తుతం కూడా ఆమె పని చేస్తూనే ఉన్నారు.

ఇక పార్టీలో తనకు మంచి స్థానం ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు కిల్లి కృపారాణి. 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో కిల్లి కృపారాణి శ్రీకాకుళం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు . ఆమె కేంద్ర మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు పై విజయం సాధించడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర విభజన అనంతరం కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో కొనసాగినా, అంతగా ప్రభావాన్ని చూపలేకపోయారు . ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె గత ఎన్నికల ముందు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.

కిల్లి కృపారాణి కోరిన రెండు స్థానాలలో వైసీపీ అభ్యర్ధులు పరాజయం పాలుకావడం శ్రీకాకుళం నుండి ఎంపీగా రామ్మోహన్నాయుడు, టెక్కలి ఎమ్మెల్యే గా అచ్చెన్నాయుడు విజయం సాధించడం ఉత్తరాంధ్రలో వైసిపిని బలహీనం చేశాయి. దీంతో ఉత్తరాంధ్రలో పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి . ఈ క్రమంలోనే కిల్లీకృపారాణికి రాజ్యసభ సభ్యునిగా అవకాశమిస్తే ఉత్తరాంధ్ర మీద పట్టు సాధించినట్లుగా అవుతుందని కిల్లి కృపారాణి కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది . ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని కోలుకో లేకుండా దెబ్బ తీయాలని భావిస్తున్న జగన్ కిల్లీ కృపారాణికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారని వైసీపీలో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. స్థానిక వైసీపీ నేతలు ఈ విషయంపై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో కిల్లి కృపా రాణికి జగన్ చాన్స్ ఇస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

VV VINAYAK MAY JOIN YCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *