రైతులకు పావలా వడ్డీకే రుణాలు ..

Kisan Credit Card Loan Interest Rate

రైతు సంక్షేమమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఆర్థిక భరోసాను అందిస్తున్న  మోదీ సర్కార్ తాజాగా రైతులకు ప్రయోజనం కలిగించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను అందించనుంది. సాధారణంగా బ్యాంకులు ఉద్యోగులు, వ్యాపారులకు క్రెడిట్‌కార్డులు అందజేస్తాయి. రైతులకు భరోసా కల్పించేందుకు కిసాన్‌ క్రెడిట్‌కార్డు పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ కార్డులను రైతులకు మాత్రమే అందిస్తాయి. ఈ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రైతులకు బ్యాంకులు రుణాలు అందజేయనున్నాయి.అధిక వడ్డీల భారం నుండి అన్నదాతకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను తెరమీదకు తెచ్చింది. ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందే ప్రతి ఒక్క రైతుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాలని భావిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అది కూడా రైతులు గతంలో తీసుకున్న రుణాలను గడువులోపు కడితేనే ఇది వర్తిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండానే రూ1.6 లక్షల వరకు రుణం పొందొచ్చు. బ్యాంకులు రుణాలపై సాధారణ వడ్డీనే వసూలు చేస్తాయి. ఒకవేళ రైతులు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోతే అప్పుడు కాంపౌండింగ్ వడ్డీ పడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద సులభంగా రుణాలు తీసుకోవడమే కాకుండా మరో బెనిఫిట్ కూడా పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణంతో పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కవరేజ్ కూడా లభిస్తుంది. కేసీసీ అకౌంట్‌‌లోని డబ్బులకు సేవింగ్స్ వడ్డీ రేటు వర్తిస్తుంది.కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

Kisan Credit Card Loan Interest Rate,kisan credit card, kisan samman nidhi , raithu bandhu , raithu bheema , modi , central government , crop  loans , less interest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *