ఘనంగా జరిగిన కొమురెల్లి మల్లన్న పెద్ద పట్నం వేడుక

Spread the love

Mallana Festival Celebrations

కోరి కొలిచిన వారి కొంగు బంగారంగా భావించే కొమరవెల్లి మల్లన్న పెద్ద పట్నం వేడుక కన్నులపండుగ గా జరిగింది. పెద్దపట్నం వేడుకను తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఒగ్గు పూజారులు ఆచారాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మల్లన్న పెద్ద పట్నం చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. పెద్ద పట్నం తొక్కేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. శివ శక్తుల చిందులతో, పోతరాజుల వీరంగాల తో, మల్లన్న శరణుఘోష లతో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం మారుమోగింది.
కోరిన వారి కోర్కెలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్ద పట్నం వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అత్యంత కీలకంగా భావించే పెద్ద పట్నం వేసే ముందు ఒగ్గు పూజారులు ఆచారం ప్రకారం పట్టు వస్త్రాలను గర్భాలయంలోని స్వామివారికి సమర్పించి పరమ శివుడి తలపై కొలువైన గంగాదేవి తన కొలిచినట్లుగా యాదవ పూజారులు స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి, కోనేట్లో స్నానం ఆచరింపజేసి, శుద్ధి చేసి గండదీపం పెట్టి గంగ తెప్ప వదిలారు.
పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన అనంతరం గొంగళిలో బియ్యం పోసి మహిళ పాలు తీసి స్వామివారి ధరించే త్రిశూలం డమరుకం నెలకొల్పి పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు ,పచ్చలను ప్రమథగణాలు గా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పి పట్నం వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక అష్టదిక్కులలో నిమ్మకాయలు, గుమ్మడికాయలతో బలిహరణ చేసి పెద్ద పట్నం పైకి ఆవాహనం చేశారు. బొగ్గు పూజారులు బోనాలు తీసుకు వచ్చిన అనంతరం, తెల్లవారుజామున గర్భాలయంలో నుంచి వీర శివార్చనకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం చుట్టూ ప్రదక్షణలు చేసి పట్నం తొక్కటం ప్రారంభించారు. పెద్ద పట్నాన్ని తిలకించిన భక్తులు ఆనంద్ తన్మయత్వం తో ఊగిపోయారు. శివసత్తుల చిందులతో, పోతరాజుల సిగాలతో ఆలయ ప్రాంగణమంతా మల్లన్న శరణుఘోషతో మార్మోగింది.

Latest Interesting Telugu News Tsnews

For More New 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *