అజ్ఞాతంలోకి కొరటాల శివ…???

3
koratala in underground
koratala in underground

koratala in underground

కొరటాల శివ-  మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఆచార్య. ప్రస్తుతం ఆచార్య కథ విషయంలో కాంట్రవర్శీ జరుగుతోన్న టైమ్ లో కొరటాల శివ అజ్ఞాతంలోకి వెళ్లాడు అనే వార్త చాలామందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొన్ని రోజులుగా ఈ కథ నాదే అంటూ రాజేశ్ అనే ఓ కో డైరెక్టర్ మీడియాల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ఓ టివి ఛానల్ కు వచ్చిన కొరటాలకు ఆ ఛానల్ వాళ్లు షాక్ ఇచ్చారు. అతనికి చెప్పుకుండానే రాజేశ్ ను లైన్ లోకి తీసుకున్నారు. ఈ విషయంలో కొరటాల చాలా హర్ట్ అయ్యాడట. ఈ విషయాన్ని ఛానల్ అధినేత వరకూ తీసుకువెళ్లి ‘మీ వాళ్లు’చేసిందేం బాలేదు అని ఫీలయ్యాడట. మరోవైపు రాజేశ్ అనే వ్యక్తి చెప్పిన కథలోని కొన్ని పాయింట్స్ కొరటాల ఆచార్య మోషన్ పోస్టర్ కే సింక్ అవుతున్నాయి. దీంతో చాలా వేళ్లు కొరటాల వేపే చూపిస్తున్నాయి. అతను ఈ కథ నాది.. నీ కథకు సంబంధం లేదని రాజేశ్ అనే వ్యక్తితో ఎంత వాదించినా ఎందుకో అంతా కొరటాల పైనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో మరో కీలకమైన విషయం రైటర్స్ అసోసియేషన్ నిజాయితీ. యస్.. ఆచార్య కథ నాదే అంటోన్న వ్యక్తి నుంచి అసోసియేషన్ కథ తీసుకుంది. అలాగే కొరటాల నుంచి కూడా కథ తీసుకుని రెంటినీ పరిశీలించి నిజం తేల్చాల్సిన రైటర్స్ యూనియన్ కొరటాలను కథ అడగటం లేదు.

ఇది మరింత అనుమానాలకు తావిస్తోంది. ఎంత పెద్ద బ్యానర్ కథ అయినా ఇలాంటి సందర్భాల్లో నిజం కోసం నిలబడాలి. కానీ కొరటాల అందుకు ఒప్పుకోవడం లేదు. అందువల్ల రాజేశ్ వాదనకు మరింత బలం వస్తోంది. ఇక చిరంజీవి సైతం ఈ వ్యవహారంలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కొరటాల గత సినిమాలన్నీ కూడా ఇలా కథల విషయంలో కాంట్రవర్శీలు అవుతున్నాయి. తనతో చేసే సినిమా విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. మరోసారి అదే రిపీట్ అయ్యేలా చేయడంతో చిరంజీవి ఫీల్ అయ్యాడట. దీంతో ఈ విషయంలో కొరటాలను వివరణ అడగాలని కొందరు మీడియా వారితో పాటు చిరంజీవి సన్నిహితులు కూడా ప్రయత్నించారు. కానీ అతను ‘నేను అందుబాటులో లేను’ అనే మెసేజ్ నే అందరికీ పంపిస్తున్నాడని సమాచారం. ఏదేమైనా ఆచార్య కథ గొడవ కొరటాలను బాగానే డిస్ట్రబ్ చేసినట్టుంది. మరి ఈ వ్యవహారంలో నిజం, న్యాయం గెలుస్తాయా అనేది పక్కన బెడితే రాజకీయాల్లోనూ, సినిమా రాజకీయాల్లోనూ ఎప్పుడూ గెలిచేదంతా న్యాయం కాదనేది మాత్రం ఎప్పటికీ నిజం.

tollywood news