Korean WebSeries On Corona
ప్రపంచ వ్యాప్తంగా 190 కి పైగా దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మొదట కరోనా అని పిలిచినా ఆ తర్వాత కోవిడ్-19 గా పేరు మార్చారు. అంటే ఈ వైరస్ 2019 లో పుట్టింది. ఈ వైరస్ కారణంగా ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మాయదారి రోగం గురించి ఓ వెబ్ సిరీస్ ముందే చెప్పేసింది. 2018 లో వచ్చిన ఓ కొరియన్ వెబ్ సిరీస్ మొదటి భాగం 10 వ ఎపిసోడ్ ఈ వైరస్ గురించి ప్రస్తావన వుంది. అది కూడా ఏదో వైరస్ అని కాదు స్పష్టంగా కరోనా వైరస్ అని పేర్కొన్నారు. మొదట ఓ వ్యక్తి రేపటి ప్లాన్ గురించి తన భార్యతో చర్చించడం బయటకు వెళ్లోద్దని సూచించడం జరుగుతుంది.
ఇక ఓ శాస్త్రవేత్త రీసర్చ్ స్కాలర్ తో ఈ వైరస్ గురించి స్పష్టంగా చెప్పుకొచ్చారు ఇప్పటి వైరస్ లో ఉన్న లక్షణాలనే వివరించారు. రెండు నుంచి 14 రోజుల వ్యవధిలో దాని ప్రభావం తెలుస్తుందని.. దాదాపు 90 శాతం మంది దీని భారిన పడతారని.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.. ఇలా కరోనా కు ఉన్న లక్షణాలను వివరిస్తారు. ఇక సదరు మహిళా ఇది వెపన్ ల ఉపయోగిస్తారా? అనే అనుమానాన్ని కూడా లేవనెతింది. ఈ వెబ్ సిరీస్ కు చెందిన ఆ పార్ట్ ను మాత్రమే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. మొత్తానికి 2019 వచ్చినా ఈ వైరస్ గురించి ఆ రచయిత మాత్రం ఓ ఏడాది ముందే చెప్పడం చర్చగా మారింది.
tags: corona virus , corona effect , corona control , lock down, KOREAN WEB SERIES ON CORONA