చిరంజీవి ఫ్యామిలీ కోసమే క్రిష్ త్యాగం

3
krish sacrifise
krish sacrifise

krish sacrifise

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేయడానికి తనకు ఇష్టం ఉందో లేదో కానీ ఓ త్యాగం చేస్తున్నాడు క్రిష్. అందుకు రిటర్న్ గా ఇప్పుడే ఏం రాకపోయినా రాబోయే రోజుల్లో చిరంజీవి డేట్స్ దొరికే అవకాశం ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ అయి ఉంది కాబట్టి ఇక చిరంజీవి టార్గెట్ గానే రాబోయే రోజుల్లో స్క్రీప్ట్స్ రాసుకుంటాడు క్రిష్. అన్నట్టు అతను చేసిన సెంటిమెంట్ త్యాగం ఏంటీ అనుకుంటున్నారా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ఏదీ..పునాది రాళ్లు. కానీ ముందుగా విడుదలైంది ప్రాణం ఖరీదు. ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. తొలి సినిమా రేయ్ అయినా ముందు విడుదలైంది. పిల్లా నువ్వులేని జీవితం. ఇప్పుడు మరో మేనల్లుడు విషయంలోనూ అదే జరుగుతుంది. లేదంటే జరగాలని భావించారేమో తెలియదు కానీ.. వైష్ణవ్ తేజ్ విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు.
చిరంజీవి మరో మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన.

లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. అంతా ఓటిటిలో వస్తున్నా.. కుర్రాడి ఫస్ట్ మూవీ కాబట్టి థియేటర్స్ లోనే చూడాలనుకుంటున్నారు. అందుకోసం థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ ఆగాలనుకున్నారు. కానీ  ఈ లోగా సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ క్రిష్ తో మరో సినిమా చేయిస్తున్నారు. కొండపొలం అనే నవల ఆధారంగా ఎక్కువ శాతం అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీని డైరెక్ట్ గా ఓటిటిలోనే విడుదల చేస్తారట. అంటే వైష్ణవ్ కు రిజల్ట్ ఎలా ఉన్నా.. తొలి సినిమా ఇదే అవుతుంది. మలి సినిమాగా వాళ్లు ‘గ్యారెంటీ హిట్’అనుకుంటోన్న  ఉప్పెన వస్తుంది. నిజానికి చిరంజీవి పునాదిరాళ్లు పెద్దగా ఆడలేదు. కానీ ప్రాణం ఖరీదు ఆకట్టుకుంది. అతనికీ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చింది. ఇటు సాయిధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ రేయ్ డిజాస్టర్. ముందుగా విడుదలైన పిల్లానువ్వులేని జీవితం హిట్. మరి ఈ సెంటిమెంట్ కోసమే క్రిష్ కు చాన్స్ ఇచ్చారా లేక నిజంగానే అతని కథకు వాల్యూ ఇచ్చారా అనేది ఓటిటిలో వస్తే కానీ తెలియదు.

tollywood news