పవన్ కళ్యాణ్ ను కాదని మరో మెగా హీరోతో క్రిష్..?

1
krish movie update
krish movie update

krish with vaishnav

ఒక సినిమా కూడా విడుదల కాలేదు. అయినా ఆల్రెడీ రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి మేనల్లుడుగా, సాయిధరమ్ తేజ్ తమ్ముడుగా ‘ఉప్పెన’ సినిమాతో పరిచయం అయ్యాడు వైష్ణవ్. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయింది. తొలి సినిమా కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్ లోనే విడుదల చేయాలనే భావనలో ఉన్నారు అని చెబుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెనలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేయడం విశేషం. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ పాటలు రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఇక ఈ మూవీ విడుదల కాకుండానే వైష్ణవ్ మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో ఒక సినిమా అనూహ్యంగా ఓపెనింగ్ జరుపుకోవడం విశేషం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సినిమాకు కమిట్ అయి ఉన్న క్రిష్.. ఎవరూ ఊహించని విధంగా వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. చిన్న సినిమా చాలా త్వరగా పూర్తవుతుందనే నమ్మకంతో కావొచ్చు.. లేదంటే పవన్ కళ్యాణ్ మూవీ రావడానికి ఇంకా టైమ్ ఉండటం వల్ల కావొచ్చు.

కారణం ఏదైనా క్రిష్ ఇలా పవన్ కంటే ముందు సినిమా చేస్తాడని.. అదీ మెగా కుర్రాడితోనే అని ఎవరూ ఊహించలేదు. పైగా ఈ చిత్రాన్ని నిర్మించేది కూడా క్రిషే. అంతకంటే మరో విశేషం.. మూవీలో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా తీసుకోవడం. ఇప్పటికే అమ్మడు అందరు స్టార్స్ తో చేసేసింది. దాదాపు తను ఇక ఫేడవుట్ అనుకుంటోన్న టైమ్ లో క్రిష్ ఈ చాన్స్ ఇవ్వడం ఆశ్చర్యమే. అదీ కాక కుర్రాడు లేతగానూ.. రకుల్ కాస్త ముదరగానూ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. మొత్తంగా మెగా కుర్రాడు దూకుడు పెంచాడు. ఉప్పెన తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అరవింద్ నిర్మించే సినిమా ఉంటుంది. కానీ వరస చూస్తోంటే అరవింద్ కంటే ముందే క్రిష్ సెకండ్ సినిమా పూర్తి చేసేలా ఉన్నాడు. మరి ఈ కుర్రాడు ఇండస్ట్రీలో ఎలా సెటిల్ అవుతాడో చూడాలి.

tollywood news