కృష్ణుడు తండ్రి మృతి…

Krishnudu Father Died

సినీ నటుడు కృష్ణుడు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణుడు తండ్రి అల్లూరి సీతారామరాజు ఈ రోజు సోమవారం కన్నుమూశారు.

కొంతకాలంగా అల్లూరి సీతారామరాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను భీమవరం హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే నిన్న అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ మేరకు అత్యవసర వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. నేడు అయన తుది శ్వాస విడిచారు. కృష్ణుడు తండ్రి మరణంతో తూర్పుగోదావరి జిల్లా రాజోలు విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు వినాయకుడు సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ అలరించిన కృష్ణుడు గత ఎన్నికల వేళా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం జగన్ చేపట్టిన పాదయాత్రలోను కృష్ణుడు జగన్ తో నడిచాడు.

Krishnudu Father Died,#Actor Krishnudu,alluri sitarama raju passes away,YCP Leader Krishnudu,CM Jagan,Padayatra,Bhimavaram Hospital,Health Problem,Vinayakudu Hero Krishnudu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *