చంద్రబాబు దారుణంగా ఓడిపోతారు

Spread the love

KTR ABOUT CHANDRABABU

  • ఏపీకి జగన్ సీఎం కావడం ఖాయం
  • కేంద్రలో టీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది
  • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ కు త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఆయన నిరాశా నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిద్రలో కూడా కేసీఆర్ పేరు కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ఏపీ ఎన్నికల్లో బాబు దారుణంగా ఓడిపోతారు. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం’’ అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఢిల్లీని శాసిద్దాం.. తెలంగాణ హక్కులను సాధించుకుందాం అనే నినాదంతో తాము లోక్ సభ ఎన్నికలకు వెళ్తున్నట్టు చెప్పారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల మాదిరే పార్లమెంటు ఎన్నికల్లోనూ తాము ఘన విజయం సాధిస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్లు ఎన్నికల్లో రాహుల్‌ వర్సెస్‌ మోదీ వాతావరణం ఉండదన్నారు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలు కావని, అవి రెండూ కేవలం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వంద స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదని, బీజేపీ కూడా గెలిచే స్థానాల సంఖ్యం గతం కంటే బాగా తగ్గుందని పేర్కొన్నారు. ఇక సమాఖ్య కూటమిపై చర్చించేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ను కలుస్తారని వెల్లడించారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *