KTR About RTC Workers Issue
ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. తెలంగాణలో 43 రోజులుగా వివాదంగా మారిన ఆర్టీసీ సమ్మె విషయం పైన లోక్ సభలో ప్రస్తావించటానికి బీజేపీ సిద్దం అవుతోంది. దీంతో..తిప్పి కొట్టటానికి టీఆర్ఎస్ సిద్దం అవుతోంది. టీయస్ఆర్టీసీ సమ్మె పైన లోక్ సభ లో చర్చకు వస్తే ఎంపీలు ముక్తకంఠంతో స్పందించాలని సూచించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాల పైన పార్టీ ఎంపీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు . రాష్ట్ర విభజన సమస్యలు.. కేంద్రం నుండి రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులతో పాటుగా రాజకీయ అంశాలను ఆ భేటీలో ప్రస్తావించారు. అదే విధంగా కేంద్రం ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విషయం స్పష్టం చేయాలని సూచించారు. ఎంపీలకు ఆయన ఈ అంశం పైన స్పష్టత ఇచ్చారు అలాగే రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న దాదాపు 30 అంశాలను ఎంపీలకు తెలియజేసిన కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వాటికోసం పార్లమెంటులో గట్టిగా పట్టుబట్టాలి అన్నారు. ఉభయసభల్లో బిల్లులు , వివిధ అంశాలపై జరిగే చర్చల్లో విస్తృతంగా పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ఇక ఆర్టీసీ ప్రస్తావన వస్తే దీటుగా సమాధానం ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ యాక్ట్ 2019 ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. వివాదాలకు తావు లేకుండా అందరూ ఒక మాట మీద ఆర్టీసీ సమ్మె విషయంలో మాట్లాడాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
tags : tsrtc strike, rtc strike, telangana government, rtc workers JAC, trs working president, ktr, parliament session, trs mps, rtc issue
సకల జనుల సమ్మె రికార్డును బ్రేక్ చేసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె