Ktr Agreed On Illegal Constructions
హైదరాబాద్లో అక్రమ కట్టడాల్ని అరికట్టలేకపోయామని మంత్రి కేటీఆర్ అంగీకరించారు. గురువారం ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయంలో హైదరాబాద్లో భారీగా కబ్జాలు పెరిగాయని, అందుకే ఇటీవల కురిసిన వరదల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. వందేళ్లలో కురిసే ఇలాంటి వర్షాలకు ముందే అప్రమత్తం కావడం ఎవరికైనా కష్టమేనన్నారు. అయితే, తాము అధికారంలోకి వచ్చాక కూడా అక్రమ కట్టడాలు పెరిగాయని, వాటిని నిరోధించలేకపోయామని అంగీకరించారు. భవిష్యత్తులో నాలాల దురాక్రమణను నిరోధించడానికి ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. పేద ప్రజల స్థిరాస్తి మీద యాజమాన్యహక్కుల్ని కల్పించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అయితే, సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి అక్రమ కట్టడాల్ని నిరోధించలేకపోతే, మరెవరు అరికడతారో అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అక్రమ కట్టడాల్ని నిరోధించలేరేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఈ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నామని కొందరు అంటున్నారు. మరి, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ghmc elections 2020 latest news