Ktr Financial Help to Journalists
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 7న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు చేతుల మీదుగా నెక్లెస్ రోడ్లు లో గల జలవిహర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు చెక్కుల పంపిణీ కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శనివారం మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ తో కలిసి జల విహార్ లో నిర్వహిస్తున్న జర్నలిస్టుల చెక్కుల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సారి సంక్షేమ నిధి ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మరణించి 87 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక అనారోగ్య/ప్రమాదాల బారిన పడిన 18 మంది జర్నలిస్టులకు యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఈ కార్యక్రమంలో మంత్రి కే.టి.ఆర్. చేతుల మీదుగా అందజేస్తామని ఆయన తెలిపారు.