పురపాలక శాఖను నిద్రలేపిన కేటీఆర్

KTR FIRST MEETING WITH MUNICIPAL OFFICIALS

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఇక నుంచి తెలంగాణలోని నగరాలు, పట్టణాలు మరోసారి కళకళలాడనున్నాయి. ఇంతవరకూ కొంత నిద్రలో జోగుతున్న పురపాలక శాఖను కొరడా పట్టుకుని  మరీ పరుగెత్తించడానికి మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగేశారు. కేటీఆర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో.. మరుసటి రోజే పురపాలక శాఖ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గత కొంతకాలం నుంచి నిద్ర పోతున్న పురపాలక శాఖను మరోసారి తట్టి నిద్ర లేపారు. టైగర్ ఈజ్ బ్యాక్ అని సంకేతాలు పురపాలక శాఖకు పంపించారు. ఇక నుంచి ప్రతిఒక్కరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని చెప్పకనే చెప్పారు. రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోమవారం ఉదయం పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్,  డీటీసీపీ హెడ్ విద్యాధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం ప్రాధాన్యతలపైన మంత్రి విభాగ అధిపతులకు దిశానిర్దేశం చేశారు. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ సమావేశం అవుతానని తెలిపిన కేటీఆర్, ప్రతి విభాగం తన కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపైన ఒక నివేదిక సమర్పించాలని కోరారు. నూతనంగా పదవీభాద్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్ మొక్కను అందజేసి విభాగాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అలోచనలు, విజన్ మేరకు పనిచేస్తామని అధికారులు మంత్రి కేటీఆర్ కు హామీ ఇచ్చారు.

telangana municipal updates, #ktr, #ministerktr, #ktrtweet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *