కేటీఆర్ కి జర్నలిస్టుల గుర్తొచ్చారే..

4
KTR FOCUS ON JOURNALIST ISSUES
KTR FOCUS ON JOURNALIST ISSUES

KTR FOCUS ON JOURNALIST ISSUES

అదేంటో కానీ హఠాత్తుగా కేటీఆర్ కి జర్నలిస్టుల సమస్యలు గుర్తుకొచ్చాయి. గతంలో కూడా సరిగ్గా ఎన్నికల సమయంలోనే చిన్న సారుకి జర్నలిస్టుల మీద ఎక్కడ్లేని ప్రేమ కలిగింది. మళ్లీ రెండేళ్ల విరామం తర్వాత ఆయన పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ తో సమావేశమయ్యారు. కరోన సమయంలో బాధిత జర్నలిస్ట్ లకు ఒక్కొక్కరికి 20000 చొప్పున అందజేసిన ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ ని మంత్రి కే టి ఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఇతర సమస్యలను కూడా కేటీఆర్ ఆడిగి తెలుసుకున్నారు.

* ప్రెస్ అకాడమీ కి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించడం

* జిల్లా కేంద్రాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్ట్ లకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడం

*  హైద్రాబాద్ లోని జర్నలిస్ట్ లకు ఇల్లు కల్పించడం, జవహర్ లాల్ నెహ్రు సొసైటీ కి పెట్ బషీరాబాద్ లోని స్థలాన్ని కేటాయించడం

* చిన్న పత్రికల గ్రేడింగ్ తో పాటు అనేక సమస్యలపై మంత్రిగారు చర్చించారు. ఈ సందర్బంగా ఈ నెల 7న చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాల సహాయనిది అందజేసే కార్యక్రమనికి హాజరు కావాలని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కేటీఆర్ ను కోరగా అంగీకరించారు.

* జర్నలిస్ట్ ల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని దేశంలో ఎక్కడా ఏ ప్రెస్ అకాడెమీ కూడా పనిచేయని విధంగా తెలంగాణ మీడియా అకాడమీ పనిచేస్తూ ప్రభుత్వం సహకారంతో అనేక రకాలుగా సహాయసహకారాలు అందిస్తున్నదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. మిగిలిన సమస్యలన్నింటిని కూడా కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని ఇళ్ల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగా ఉన్నారని కేటీఆర్  చెప్పారు. సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ,ఎల్ ఎల్ ఏ లు క్రాంతి కిరణ్, బాల్క సుమన్, టి యు డబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ అధ్యక్ష కార్యదర్శులు ఇస్మాయిల్ రమణ, హైద్రాబాద్ యూనిట్ అధ్యక్షుడు యోగనందం మరియు ఫోటో జర్నలిస్ట్ అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు.

Telangana Mlc Elections 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here