కేటీఆర్ కు ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సు ఆహ్వానం

KTR RECEIVED INTERNATIONAL INVITATION

సదస్సుకు హాజరుకానున్న ఇరుదేశాల కీలక వ్యాపార, వాణిజ్య రంగాల ప్రతినిధులు

వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల పైన చర్చించనున్న సదస్సు

దీంతోపాటు ప్రభుత్వాల మధ్య వివిధ అంశాల్లో భాగస్వామ్యానికి సైతం అవకాశం

తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఈసారి ఆస్ట్రేలియా నుంచి అక్కడ జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్షిప్ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. డిసెంబర్ 8-9 తేదీల్లో ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో జరిగే నాలుగవ ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సులో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానం పంపడం జరిగింది. రెండు దేశాలకు చెందిన వ్యాపార వాణిజ్య మరియు ప్రభుత్వ రంగంలోని ప్రభావశీల, నిర్ణయాత్మక ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. ఆస్ట్రేలియా – ఇండియా సంబంధాలు, వివిధ ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు, ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల బలోపేతం దిశగా చేపట్టవలసిన కార్యాచరణకు సంబంధించి ఈ సదస్సులో చర్చిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అత్యధిక శాతం మంది విద్యార్థులు ఆస్ట్రేలియా విద్యాసంస్థలను తమ వీదేశీ విద్య కోసం ఎంచుకుంటున్న నేపథ్యంలో విద్యా, టెక్నాలజీ రంగంలో ఉన్న ఉపాధి మరియు పెట్టుబడి అవకాశాల గురించి చర్చించే అవకాశం ఉంటుందని అని మంత్రి కేటీఆర్ గారు పంపిన లేఖలో ఆస్ట్రేలియా -ఇండియా లీడర్షిప్ సదస్సు నిర్వాహకులు తెలిపారు.

INDIA- AUSTRALIA LEADERSHIP 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *