పట్టణాల్లో జోష్ నింపిన కేటీఆర్

ktr shaped the cities

పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తన సత్తా చాటిచెప్పారు. విద్యావంతుడు మున్సిపల్ మంత్రి అయితే డెవలప్మెంట్ను సులువుగా చేయవచ్చని నిరూపించాడు. ప్రస్తుతం హైదరాబాద్ జిహెచ్ఎంసి మరియు హెచ్ఎండిఏ లాంటి చోట్ల డీపీఎంఎస్ విధానంలో ఇస్తున్న బిల్డింగ్ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు పురపాలక శాక ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పురపాలక పట్టణాల్లో ఆన్లైన్ ద్వారా బిల్డింగ్ అందించే ప్రక్రియ అనుమతులు అందించే ప్రక్రియ తెలంగాణ పురపాలక శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ క్యాబినెట్ తుది ఆమోదం తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని పురపాలక శాఖ తెలిపింది. టిడిఆర్ పాలసీకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా జీహెచ్ఎంసీలోని రోడ్డు విస్తరణ మరియు ఇతర అభివృద్ధి పనులకు కావలసిన ఆస్దుల సేకరణ మరింత తేలిక అయింది. ఈ కార్యక్రమం వలన స్థానిక సంస్థల పైన ఆర్థిక భారం పడకపోవడంతో ఆస్తుల సేకరణ మరింత సులభం అయింది. ఇప్పటిదాకా 2019- 20 సంవత్సరానికి 250 కోట్ల విలువైన టిడిఅర్ సర్టిఫికెట్ల అమ్మకం జరిగింది. పౌరులు తాము తీసుకున్న సర్టిఫికెట్ల కొనుగోలుకు సంబంధించి ఒక టిడిఆర్ ఆన్లైన్ బ్యాంకును పురపాలక శాఖ ఏర్పాటు చేసింది

మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి

ప్రపంచంలోనే పొడవైన పీపీపి మెట్రో రైల్ ప్రాజెక్ట్ 69 కిలోమీటర్ల మేర పూర్తి అయింది. హైదరాబాద్ మెట్రో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో అతి పొడవైన మెట్రో రైల్ నెట్వర్క్ గా రూపొందింది. 2020 ఫిబ్రవరి నాటికి సుమారు 4 లక్షల మంది రోజువారీగా ప్రయాణం చేస్తూ రద్దీ అయినా మెట్రోల్లో ఒకటిగా నిలిచింది.  పట్టణ పేదలకు బస్తి దావఖానాల ద్వారా ఆరోగ్యాన్ని అందించేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటిదాకా ఉన్న 123 బస్తీదవాఖాణాలకు మరో 45 దవాఖానాలను ఒకేరోజు ప్రారంబించింది. రానున్న సంవత్సర కాలంలో మొత్తం 350 బస్తీ దవాఖానాలను తెరిచేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పట్టణాల్లో తాగునీటికి ఆటంకాలు లేకుండా మంచినీటి సరఫరా చేసినట్టు పురపాలక శాఖ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా గత ఏడాది వేసవి కాలానికి సంబంధించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నదని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు తాగునీరు అందిందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి జలమండలి ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల గృహాలకు నీటి సరఫరా చేస్తుందని తెలిపింది. ఇదే జలమండలి 24 పట్టణ స్థానిక సంస్థలను, పద్దెనిమిది గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ లోపల 725 కోట్ల రూపాయలతో తాగునీటి సరఫరా ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. త్వరలోనే హైదరాబాద్కి పూర్తిస్థాయి సాగునీటి భరోసా కల్పించే 20 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణా ప్రణాళికలను వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో అర్భన్ మిషన్ భగీరధ కార్యక్రమాలు జోరుగా కోనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *