అధైర్యపడొద్దు – అండగా ఉంటాం

KTR visited rain water ares

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో నీట మునిగిన ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. పర్యటనలో ముసరాంబాగ్ లోని సలీంనగర్ లో ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రానున్న 1, 2 రోజులపాటు భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో జియచ్ యంసి ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉండాలన్నారు.

ఆయా కేంద్రాల్లో ఆహారం తో పాటు, మందులు, వైద్యులు అందుబాటులో తెలిపారు. అనంతరం రామంతపూర్ చెరువు హబ్సిగూడ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నీళ్ళు నిండిన హబ్సిగూడా ప్రజలకి ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో పెద్దఎత్తున పాల్గొనాలని స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ సూచించాడు. కేటీఆర్ వెంట మహమ్మద్ అలీ, సిఎస్, డిజిపిలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *