కుంభమేళాకు ఎవరు రావొద్దంటే?

23
kumbh mela 2021
kumbh mela 2021
Kumbh Mela 2021: Imp Dates, COVID-19 Guidelines, Special Trains
Kumbh Mela 2021: Imp Dates, COVID-19 Guidelines, Special Trains

kumbh mela 2021

ఫిబ్రవరి 27, 2021 నుండి ఏప్రిల్ 30 వరకు హరిద్వార్ లో జరుగుతున్న కుంభ మేళా సందర్భంగా వచ్చే భక్తులు మరియు యాత్రికులు కోవిడ్ -19 నియంత్రణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఓం ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. కుంభ మేళా పర్యటన సందర్భంగా కోవిడ్ -19 నివారణకు భక్తులు, యాత్రికులు SOP మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉందని, వ్యాధి వ్యాప్తి పెరగకుండా పాటించాల్సిన నిబంధనలపై భక్తులు , యాత్రికులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాసిన లేఖలో కోరారు.

* ఈ మార్గదర్శకాల ప్రకారం, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, మధుమేహం, రక్తపోటు, గుండె, పల్మనరీ మరియు మూత్రపిండాల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు, క్యాన్సర్ సెరెబ్రోవాస్కులర్ డిజార్డర్స్ , గర్భిణీ స్త్రీలు వంటి కొమొర్బిడిటీ వ్యాధి గ్రస్తులు కుంభమేళా కు రావద్దని సూచించారు. కుంభమేళా సందర్శించే భక్తులు / యాత్రికులు పాటించాల్సిన నిబంధనలిలా ఉన్నాయి.

* సందర్శకులు / యాత్రికులు అందరూ కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించడానికి నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
* కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో సందర్శకులు / యాత్రికులు కోవిడ్ -19 టెస్ట్ రిపోర్ట్ (72 గంటల లోపల తీసుకున్నది) నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం నెగటీవ్ RT PCR ను తప్పనిసరిగా సమర్పించాలి.
* భక్తులు కుంభమేళా ను సందర్శించే ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వ పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అన్ని సమయాల్లో ఆరోగ్య సేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసి ఉపయోగించుకోవాలి. తిరిగి వచ్చిన తరువాత కూడా సందర్శకులు సంబంధిత రాష్ట్రాలలో అనుసరిస్తున్న కోవిడ్ -19 పరీక్షలు లేదా క్రియాశీల పర్యవేక్షణకు లోబడి ఉండవచ్చని తెలిపారు.

 

haridwar kumbh mela 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here