Doctors Created history by Removing kidney stones from 18 months boy
– అతి చిన్నవయస్సు రోగి కిడ్నీల నుంచి రాళ్లను తొలగించి రికార్డు
– ఈ ప్రక్రియ ద్వారా చిన్నారి ప్రాణాలు కాపాడిన ఘనత
– అత్యంత విజయవంతంగా ఈ ప్రక్రియ నిర్వహించిన కర్నూలు కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు
డాక్టర్ మనోజ్‌కుమార్ నేతృత్వంలో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు తెలుగు రాష్ట్రాల్లోనే
అత్యంత అరుదైన వైద్య ప్రక్రియను నిర్వహించారు. 18నెలల బాలుడి (ఒకటిన్నర సంవత్సరాలు) ఒక మూత్రపిండం నుండి మరియు యురేటరల్లో నుంచి ఒకేసారి రాళ్లు తొలగించడం జరిగింది. ఇంత చిన్న పిల్లవాడికి ఈ ప్రక్రియ నిర్వహించడం ఏపీలో మొదటిసారి కావడం విశేషం.
మూత్రపిండాల్లో రాళ్లు రావడమనేది మన దేశంలో సాధారణంగా చూసే విషయమే. ఒంటి నుంచి ద్రవాలు నీళ్లను ఎక్కువగా కోల్పోవడం (డీహైడ్రేషన్) పోషకాహార లోపాలు, ఉప్పుతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాలు ఎక్కువగా తినడం వంటి అనేక కారణాల వల్ల మనదేశంలో మూత్రపిండాల్లో రాళ్లు రావడం చాలా సహజమే. అయితే పిల్లల మూత్రపిండాల్లో రాళ్లు రావడాన్నిడాక్టర్లు మరింత అరుదుగా చూస్తుంటారు. అందులో ఒకటిన్నర ఏళ్ల బాలుడికి రావడం ఇంకా అరుదు.
18నెలల పసివాడిని అతని తల్లిదండ్రులు తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతుండగా ఇటీవల కాలంలో అధునాతన పద్ధతులలో అరుదైన ఆపరేషన్లు చేస్తూ ప్రాణాలు రక్షిస్తున్న కిమ్స్ కర్నూలు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ చిన్నారిని పరీక్షించిన రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్తో సర్జరీ(ఆర్ఐఆర్ఎస్) తరహా లేసర్ శస్త్రచికిత్సల్లో నిపుణులైన, కిమ్స్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్‌కుమార్‌ని
సంప్రదించారు. బాలుడిని పరిశీలించిన ఆయన పలు పరీక్షలు చేయించారు. పరీక్షల్లో మూత్రపిండాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో పాటు ఒక సెంటీమీటర్ పైన ఉన్న మూడు రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే బాలుడి కిడ్నీలలో రాళ్లను తొలగించాలంటే ముందుగా బాలుడి మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి స్టంట్ వేసి 1 నెల తర్వాత సర్జరీ చేస్తామని చెప్పి బాలుడిని డిశ్చార్జి చేసి పంపించారు.
ఒక నెల తర్వాత ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని ఆస్పత్రికి వచ్చిన బాలుడికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు. మూత్రపిండంలో 1.2 సెం.మీ సైజుగల ఒక రాయి, యురేటరల్లో 1.4 సెం.మీ మరియు 1.0 సెం.మీ గల రెండు రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆర్ఐఆర్ఎస్, యూఆర్ఎస్ఎల్ విధానంలో లేసర్ ఉపయోగించి రాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్‌కుమార్ చికిత్స చేసిన విధానాన్ని ఈ తరహా ప్రక్రియ గురించి చెబుతూ.. “ఏపీలో మొట్టమొదటి సారిగా కేవలం 18నెలల వయస్సున్న ఇంత చిన్న బాలుడికి ఆర్ఐఆర్ఎస్ పద్దతి ద్వారా లేజర్ని ఉపయోగించి మూత్ర పిండాల్లోని రాళ్ల తొలగింపు ప్రక్రియను ఒకే సారి నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇది మనకెంతో గర్వకారణం“ అని పేర్కొన్నారు.
“ఆర్ఐఆర్ఎస్ అనే ఈ ప్రక్రియలో మూత్ర ద్వారం నుంచి మూత్ర నాళాల ద్వారా రాళ్లు ఏర్పడి ఉన్న మూత్రపిండాల్లోకి వెళ్లడం జరుగుతుంది. ఇలా మూత్రనాళం ద్వారా వెళ్లి, మూత్రనాళం మరియు మూత్రపిండంలో ఉన్న మూడు రాళ్లను కేవలం ఒక గంట వ్యవధిలోనే తొలగించగలిగాం. ఇది ఎండోస్కోపిక్ ప్రక్రియ కావడం వల్ల ఎలాంటి కుట్లు వేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి రక్త స్రావమూ జరగలేదు. కుట్లు వేయాల్సిన అవసరం లేకపోవడం, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోవడం వల్ల కేవలం రెండు, మూడు రోజుల్లోనే పిల్లవాడిని డిశ్చార్జి చేయగలిగాం“అని డాక్టర్ మనోజ్‌కుమార్ వివరించారు.
కిమ్స్ కర్నూలు ఆస్పత్రి డాక్టర్ల బృందంలోని ప్రధాన సర్జన్ డాక్టర్ మనోజ్‌కుమార్ తో పాటు రేడియాలజిస్ట్ డాక్టర్లు అరవింద్, అభిషేక్, అనస్థీషియా డాక్టర్ విజయసాయి, డాక్టర్. గౌసియాలు ఈ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియలో పాల్గొన్నారు.
చిన్నారి బాలుడి తండ్రి షబ్బీర్ అహ్మాద్ మాట్లాడుతూ “ మా బాబును డాక్టర్ మనోజ్‌కుమార్ చాలా జాగ్రత్రగా చూసుకున్నారు. ఆస్పత్రి బృందమంతా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు మా బాబు కిడ్నీలలో ఎలాంటి రాళ్లూ లేవు. మా వాణ్ణి బతికించిన కిమ్స్ కర్నూలు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య బృందానికి నాకృతజ్ఞతలు. వారి సేవలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. నా కొడుకు ప్రాణాలు కాపాడిన డాక్టర్ మనోజ్‌కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను“అను ఉద్వేగంగా చెప్పారు.
బాబు మూత్రపిండాల్లో మరోమారు రాళ్లు వృద్ధి చెందకుండా చూసుకునేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని కిమ్స్ కర్నూలు డాక్టర్ల వైద్య బృందం తెలిపింది.
కిమ్స్ కర్నూలు ఆస్పత్రి గురించి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల వ్యాధులు, సమస్యలకు చికిత్సల వంటి ఉన్నత స్థాయి వైద్యచికిత్సలు సాధ్యమయ్యే ఆస్పత్రి ఇది. మూత్రపిండాల మార్పిడి వంటి అత్యాధునిక వైద్య చికిత్సలు అందించగల రాష్ట్రంలోని అత్యున్నతస్థాయి ఆస్పత్రుల్లో కిమ్స్ ఆస్పత్రి ప్రధానమైంది. మూత్రపిండాల్లోని రాళ్ల తొలగింపు, ప్రొస్టేట్ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు, అధిక రక్తపోటుకు చికిత్సలు, వయస్సు పైబడ్డాక వచ్చే మూత్ర సమస్యలు, ప్రొస్టేట్ మరియు మూత్రపిండాల క్యాన్సర్లు, మహిళల్లో ఎక్కువగా కనిపించే యూరిన్ ఇన్ఫెక్షన్లు మరియు తమకు తెలియకుండానే మూత్ర విసర్జన చేయడం, చిన్న వయస్సులో కిడ్నీ సమస్యలకు ఇక్కడ సమర్ధమైన చికిత్స దొరుకుతుంది. ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్‌కుమార్ నేతృత్వంలో అత్యంత సంక్షిష్టమైన అనేక శస్త్ర చికిత్సలెన్నింటినో విజయవంతంగా నిర్వహించిన ఘనత ఈ ఆస్పత్రికి ఉంది.