Smiriti Mandhana likes Sanju batting
‘‘ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని చూస్తున్నా. అందరి ఆటను పరిశీలిస్తున్నా. అలా అని ఏ జట్టుకు సపోర్ట్ ఇవ్వడం లేదు. విరాట్, డివిలియర్స్, రోహిత్ శర్మ, ధోని బ్యాటింగ్ బాగా నచ్చుతుంది. ముఖ్యంగా రాజస్థాన్ ప్లేయర్ సంజు శాంసన్ కు నేను పెద్ద అభిమానిగా మారిపోయా’’ అని మహిళా క్రికెటర్ మంధాన అన్నారు. ఇప్పుడున్న ఆటగాళ్లలో సంజు బ్యాటింగ్ బాగుందని, అతని ఆటను చూసి అభిమానిగా మారిపోయానని అన్నారు. షార్జా జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడని మంధాన అన్నారు.