పెళ్లికి కూడా లీవ్ తీసుకోలేదు : వరుడే వచ్చి తాళి కట్టాడు

Lady Ias Officer not taken leave her wedding

ఓ ఐఏఎస్‌ అధికారిణి వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణకే ఇంట్రెస్ట్ చూపింది. పెళ్లి అంటేనే జీవితంలో మరిచిపోలేని రోజు. ఆమె పెళ్లికి కూడా లీవ్ తీసుకోలేదు. దీంతో వరుడే  వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వధువుది హైదరాబాద్‌ కాగా, వరుడు పుణే వాసి. హైదరాబాద్‌కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్‌ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్‌తో పెళ్లి కుదిరింది.

బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న జిల్లా కీర్తి విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అక్కడ రోజుకు 100 వరకు కోవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఈ టైంలో డ్యూటీని పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్‌ వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. కీర్తి అధికారిక బంగ్లాలో ఎలాంటి ఆర్భాటాలూ లేకుండా వరుడు తాళికట్టాడు. కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్‌ వీడియో యాప్‌ ద్వారా 800 మంది చూశారు.

 

Related posts:

ఫాం హౌజ్ టు బిగ్ హౌజ్ : తన యాసతో నవ్విస్తున్న గంగవ్వ
ఐటీ మహిళకొచ్చిన కష్టం పగవాడికీ రావొద్దు
అలరించిన కుమారి రమ్యా భరతనాట్యం
వీడు తండ్రా? కాదు మానవమృగం..
తిరుమలలో కేసీఆర్ కి గ్రాండ్ వెల్కమ్
తొమ్మిదోతరగతి బాలిక అత్యాచారం
నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలట
పార్లమెంట్ ఎన్నికల బరిలో నేషనల్ ఉమెన్స్ పార్టీ
బలవంతంగా తాళి కట్టి ఆపై చిత్రహింసలు పెట్టిన ఘనుడు
మహిళలకు 33 శాతం సీట్లిస్తామని ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్ద పీట వేసిన తెలంగాణా సర్కార్
మహిళా ఉద్యోగులకు సెలవు
  మహిళా ఉద్యోగులపై రక్షణా శాఖ కీలక నిర్ణయం
శబరిమలలో మహిళల ప్రవేశంపై ట్రావెన్ కోర్ బోర్డు షాకింగ్ నిర్ణయం
భానుప్రియ ఇంట్లో మరో ముగ్గురు మైనర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *