ఏపీ సర్వే తప్పైతే ఇంకెప్పుడు సర్వేల జోలికి పోనన్న లగడపాటి

Spread the love
Lagadapathi Says If he fail IN AP Elections Result Survey ILL Never DO Survey

ఆంధ్రా ఆక్టోపస్ అని చెప్పబడే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను మే 19వ తేదీ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. తెలుగుదేశం పార్టీ.. 90 నుంచి 110 స్థానాలు గెలుచుకుంటుందని…వైసీపీ 65 నుంచి 79 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. ఇతరులు ఒకటి నుంచి ఐదు చోట్ల గెలుపొందే అవకాశముందన్నారు. ఏపీలో 25లోక్ సభ స్థానాలుండగా.. తెలుగుదేశానికి 13 నుంచి 17సీట్లు, వైసీపీకి 8 నుంచి 12సీట్లు ఇతరులు ఒక చోట గెలిచే అవకాశముందన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన ఓట్ల శాతం వివరాలను లగడపాటి వెల్లడించారు. జనవరి నుంచి ఎన్నికల పోలింగ్ జరిగిన తరువాత కూడా ఇంచుమించు 110 నుంచి 120 స్థానాల వరకు వివిధ దశల్లో ప్రజల నాడి తెలుసుకున్నామని లగడపాటి చెప్పారు.

3 జిల్లాల్లో నాలుగైదు నెలల్లో సుమారు లక్షా 50వేల మందిని సర్వే చేసి నాడి పసిగట్టామని తెలిపారు. తెలుగుదేశం మరోసారి అధికారంలోకి రావడానికి అభివృద్ధి, సంక్షేమంతో పాటు అనేక అంశాలు దోహదపడ్డాయని లగడపాటి చెప్పారు. ఇక తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ జోరు కొనసాగుతుందని లగడపాటి స్పష్టం చేశారు. 17లోక్ సభ స్థానాల్లో 14 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ సున్నా నుంచి 2, ఎంఐఎం ఒకచోట గెలుస్తుందన్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలకు దగ్గరగా వస్తుందని లగడపాటి చెప్పారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సర్వే ఫలితాలు తప్పాయని, ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా ఖచ్చితమైన సర్వే నిర్వహించినట్లు చెప్పారు. తన అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి ఇంకెప్పుడు సర్వేల ఫలితాలు చెప్పనని లగడపాటి స్పష్టం చేశారు. మే 23 తర్వాత తన విశ్వసనీయత మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *