లక్షల ఉద్యోగాలు కాస్ట్ కటింగ్

Lakhs Of Jobs Lost

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్ధిక కష్టాలలోకి నెడుతుంది . కరోనా వైరస్ తో ప్రాణాలను పోగొట్టుకోవటం మాత్రమే కాదు ఉపాధిని  కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఉద్యోగాలను ఊడబీకిస్తోంది.. అంతర్జాతీయంగా వాణిజ్యం పడిపోయింది. దేశంలో లాక్ డౌన్ తో వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో వచ్చే కొన్ని వారాల్లో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని.. దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని మూడీస్ పేర్కొంది. వచ్చే కొన్ని వారాల్లోనే కరోనా ఎఫెక్ట్ తో లక్షల్లో హౌస్ హోల్డ్ ఉద్యోగాలు  కోల్పోతారని మూడీస్ స్పష్టం చేసింది.

కరోనా బయటపడ్డ జనవరి ప్రపంచ జీడీపీ 2.6 శాతం ఉంటే.. ఇప్పుడు కరోనా వైరస్ విజృంభించడంతో ఏకంగా 0.4 శాతానికి ప్రమాద స్థాయికి పడిపోతుందని తాజాగా అంచనా వేసింది. పర్యాటకం, వాణిజ్యం సహా అన్ని రకాల వ్యాపారాలు మూతపడడంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుందని మూడీ వెల్లడించింది. ఒక్క అమెరికాలోనే కరోనా కారణంగా 2 లక్షల దాకా ఉద్యోగాలు కోల్పోతున్నారని మూడీ అంచనా వేసింది. ఆ దేశ అధికారులు కూడా ఇప్పుడు కరోనా కారణంగా వ్యాపారాలన్ని ఆగిపోయాయని దేశ ఆర్థిక వ్యవస్థకు దారుణమైన నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావం ఇప్పటితో పోదని ఇది చాలా కాలం పాటు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ మీద తన ప్రభావం చూపుతుందని చెప్తున్నారు.

tags: corona virus, corona effect lock down, #kerala corona positive,# jobs cost cutting, moodys, financial crisis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *