ఈ సమస్యకు ఎన్ కౌంటర్ శాశ్వత పరిష్కారమా

Lakshmi Manchu Response Over Disha Accused Encounter

దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. దిశను హతమార్చిన చోటే నిందితులను అంతమొందించారు పోలీసులు. అయితే ఈ ఎన్కౌంటర్ పై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ సభ్యులు ఇలాంటి ఘటనలు జరిగినపుడు పోలీసులు ఇలాగే స్పందించాలని చెప్తుంటే, మరికొందరు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. ఇక తాజాగా మంచు లక్ష్మీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై స్పందిస్తూ . దిశ ఘటనలో నిందితులను కాల్చి చంపారన్న వార్త వినగానే ఓ స్త్రీగా, మాతృమూర్తిగా ఎంతో హర్షించాను, ఓ అమ్మాయిగా గర్వపడుతున్నాను, కానీ సమస్యలకు ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారం ఇస్తుందా? అంటూ మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. అలాగే ఎన్కౌంటర్లో మృతులైన వారి తల్లిదండ్రులు, భార్య పిల్లలు తీవ్రంగా బాధపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దిశ మాత్రమే కాదు, నెలల వయసున్న పసికందులు, వృద్ధ మహిళలు కూడా అఘాయిత్యాల బారినపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలి, ఈ ఎన్ కౌంటర్ దిశ తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం మాత్రమేనని, వారి బాధ తీరనిదని తెలిపారు. స్త్రీల పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల్లో మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్కౌంటర్ శాశ్వత పరిష్కారం కాదన్న భావనను మంచు లక్ష్మి వ్యక్తం చేశారు. చట్టాలలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని పదేపదే అందరు గుర్తు చేస్తున్న వేళ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చే పడతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Lakshmi Manchu Response Over Disha Accused Encounter,disha  muder, encounter, shad nagar , chatan palli bridge , police , cp sajjanar, manchu lakshmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *