lakshmi’s ntr review and rating

lakshmi’s ntr review and rating
బ్యాన‌ర్‌: ఎ జీవీ ఆర్‌జీవీ ఫిలింస్‌
న‌టీన‌టులు: విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌
దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
ప్రొడ్యూసర్ :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : రమ్మీ
రచన : రాం గోపాల్ వర్మ, న‌రేంద్ర చారి
మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
ఎడిటర్ : కమల్ ఆర్
కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
లిరిక్స్ : సిరా శ్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
రాంగోపాల్ వ‌ర్మ ఏం చేసినా వార్త‌ల్లో నిల‌చేలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు. అందుక‌నే ఎక్కువ‌గా బ‌యోపిక్స్ తీస్తాడేమో అని కూడా అనుకోవాలి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. దివంగ‌త నేత ఎన్టీఆర్ మ‌ర‌ణానికి ముందు ఆయ‌న జీవితంలో జ‌రిగిన వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ ప‌రిణామాల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌డంతో .. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు పెద్ద డ్రామానే జ‌రిగింది. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సినిమాను విడుద‌ల కానీయ‌కుండా చాలా ప్ర‌య‌త్నాలే చేశారు. ఈసీ, హైకోర్టు ఇలా చాలా కోర్టుల‌కు వెళ్లారు. అయితే చివ‌ర‌కు సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విడుద‌ల కావ‌డం లేదు. తెలంగాణ స‌హా మిగతా అన్నీ చోట్ల విడుద‌లైంది. మ‌రి సినిమా ఎలా ఉంది?  తెలుగుదేశం పార్టీనికి న‌ష్టం క‌లిగించేలా?  మ‌రో పార్టీకి లాభం చేకూర్చేలా ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం…
క‌థ‌:
ఎన్టీఆర్(విజ‌య్‌కుమార్‌) 1989లో ముఖ్య‌మంత్రిగా ఓడిపోతాడు. అత‌న్ని కుటుంబ స‌భ్యులెవ‌రూ ప‌ట్టించుకోరు. అదే స‌మ‌యంలో ల‌క్ష్మి(య‌జ్ఞ‌శెట్టి) ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను రాయ‌డానికి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్‌తో ల‌క్ష్మి ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతుంటుంది. అయితే బ‌య‌ట వీరిద్ద‌రి గురించి చెడు ప్ర‌చారం మొద‌ల‌వుతుంది. అది ఎన్టీఆర్ వ‌ర‌కు చేర‌డంతో ఆయ‌న మేజ‌ర్ చంద్ర‌కాంత్ ఫంక్ష‌న్‌లో ల‌క్ష్మిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తాడు. ఇది ఆయ‌న అల్లుడు బాబూ రావ్‌(శ్రీతేజ్‌)కి న‌చ్చ‌దు. దాంతో కుటుంబ స‌భ్యుల‌కు ఎన్టీఆర్‌, ల‌క్ష్మిల‌పై లేని పోనివి నూరిపోస్తుంటాడు. కుట్ర‌లు చేస్తుంటాడు. అదే స‌మ‌యంలో 1994 ఎన్నికలు రావ‌డంతో ఎన్టీఆర్‌, ల‌క్ష్మితో క‌లిసి ప్ర‌చారం చేసి భారీ విజ‌యాన్ని సాధిస్తారు. అయితే బాబూరావ్ ఓ ప్ర‌తికాధినేత‌తో క‌లిసి  కుట్ర చేసి పుకార్ల‌ను పుట్టించ‌డ‌మే కాకుండా.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను త‌న‌వైపు తిప్పుకుని.. ఎన్టీఆర్ సీఎం ప‌దవి లాక్కుంటాడు. ఎమ్మెల్యేల‌తో మాట్లాడ‌టానికి వెళ్లిన ఎన్టీఆర్‌పై చెప్పుల దాడి జ‌రుగుతుంది. ఆ బాధ‌తోనే ఎన్టీఆర్ కుమిలి కుమిలి చ‌నిపోతారు.
స‌మీక్ష‌:
 వ‌ర్మ ఏం చేసినా త‌న సినిమాకు ప్ర‌మోష‌న్ త‌గ్గ‌కుండా చూసుకుంటాడు. ముందు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన త‌ర్వాత పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. త‌ర్వాత నెమ్మ‌దిగా.. ఈ సినిమాపై అంద‌రి ఫోక‌స్ పెరిగింది. అలా వ‌ర్మ ఫోటోలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ విడుద‌ల చేశారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులకైతే చాలా భ‌యం ప‌ట్టేసుకుని కొంద‌రు కోర్టుల కెళితే.. కొంద‌రు వ‌ర్మ‌తో బేరసారాలాడ‌ర‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌లా ఈ సినిమాకు ఫోక‌స్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కంటెంట్‌.. అది కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో సినిమా వ‌స్తుండ‌ట‌మే. రాంగోపాల్ వ‌ర్మ మ‌రో ద‌ర్శ‌కుడు ఆగ‌స్త్య‌తో క‌లిసి సినిమా చేశాడు. నిర్మాణంలో భాగం పంచుకున్నాడు. ఈ సినిమాను నిర్మించింది వైఎస్ ఆర్ పార్టీ వ్య‌క్తి కావ‌డం మ‌రింత వివాదాల‌కు కార‌ణ‌మైంది. చివ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా విడుద‌ల కాకుండా ఆగింది. కానీ మిగిలిని చోట్ల సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమా విష‌యంలో అంద‌రూ కొత్త‌వారినే తీసుకున్నాడు వ‌ర్మ‌. ముఖ్యంగా రంగ‌స్థ‌ల న‌టుడు విజ‌య్‌కుమార్ ఎన్టీఆర్ పాత్ర‌ధారిగా అద్భుతంగా న‌టించాడు. వ‌ర్మ న‌మ్మ‌కాన్ని త‌న న‌ట‌న‌తో పెంచాడే కానీ.. త‌గ్గించ‌లేదు. ఇక ల‌క్ష్మి పార్వ‌తిగా న‌టించ‌ని య‌జ్ఞ‌శెట్టి ప్రేమ‌, అమాయక‌త్వం, అవ‌మానం ఇలాంటి ఎమోస‌న్స్‌ను చ‌క్క‌గా చేసింది. ఇక శ్రీతేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కుట్ర‌లు చేసే రాజ‌కీయ నాయ‌కుడిగా అద్భుతంగా న‌టించారు. ఈ సినిమా శ్రీతేజ్‌కు న‌టుడిగా మంచి గుర్తింపు నిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు న‌టించారు. ఇక బ‌యోపిక్స్ తెర‌కెక్కించ‌డంలో దిట్ట అయిన వ‌ర్మ గురించి మాట్లాడుకుంటే త‌ప్పే అవుతుంది. కంటెంట్‌ను షార్ట్‌గా, షార్ప్‌గా చెప్పేశాడు. ఈయ‌న టేకింగ్‌తో పాటు ఆగ‌స్త్య టేకింగ్ కూడా బావుంది. ఏ స‌న్నివేశాన్ని ఎవ‌రూ చేశార‌ని ఎవ‌రికీ తెలియ‌నంత బాగా చేశాడు త‌ను. సంగీతం, నేప‌థ్య సంగీతం, కెమెరా వ‌ర్క్ సినిమాకు మ‌రింత బ‌లాన్నిచ్చాయి.
చివ‌ర‌గా.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. ఇది కుట్ర‌ల చిత్రం
రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *