Lawyers Protest Against CBN
కర్నూలులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు కు న్యాయవాదులు చుక్కలు చూపించారు. చంద్రబాబు రోడ్డు షోను న్యాయవాదులు అడ్డుకోవడంతో పెద్ద మార్కెట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హై కోర్టు కావాలంటూ సీబీఎన్ ముందు న్యాయవాదులు తీవ్ర ఆందోళన చేశారు. దీంతో, న్యాయవాదులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట కూడా జరిగింది. హైకోర్టు విషయంలో చంద్రబాబు వైఖరి పై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు కు హైకోర్టు రాకుండా బాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీబీఎన్ హైకోర్టుకు మద్దత్తు తెలపాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
#ChandraBabuNaidu Latest News