Laxmi bomb trailer released
రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన కాంచన పెద్ద హిట్ సొంతం చేసుకుంది. వసూళ్లు బాగానే రాబట్టింది. అందుకే అక్షయ్ కుమార్ కాంచనపై మనసు పారేసుకున్నాడు. లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘కాంచన’ సినిమాకు ఇది హిందీ రీమేక్. అక్షయ్ కుమార్ టైటిల్ పాత్రను పోషించారు. కియారా అద్వానీ హీరోయిన్. దయ్యాల పట్ల భయం ఉండే యువకుడికి దయ్యం పెడితే ఎలా ఉంటుందోనని ఈ సినిమాలో చూడొచ్చు. ఇప్పుడే రిలీజ్ అయిన లక్ష్మీబాంబ్ ఆకట్టుకుంటోంది. త్వరలో హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.