ప్రారంభమైన యాదాద్రి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు

Yadadri Laxmi Narasimha swami Bramothsavam Started

లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబైంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు ఆలయ అధికారులు. కనివినీ ఎరుగనిరీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి, యాదాద్రి ప్రతిష్ట మరింత పెంచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి.బ్రహ్మోత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు ఉదయం సమయంలో అలంకార సేవలు, రాత్రి సమయాల్లో శ్రీవారి వాహనసేవలు ఉంటాయని ఈవో తెలిపారు. 15వ తేదీ ఉదయం జరిగే కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ విశిష్ట అతిథిగా రానున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు వివరించారు.
మార్చి 08వ తేదీన అంటే నేడు బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ చేసి, స్వస్తివాచనం, రక్షా బంధనం నిర్వహిస్తున్నారు . మార్చి 9వ తేదీ దేవతాహ్వానం పలుకుతారు. సుమారు 40 మంది రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. ఆలయంలో హోమగుండం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా యాగశాల నిర్మాణం చేశారు. వేసవి కాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చలువ పందిళ్ళు వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హై స్కూల్ మైదానంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది.నేటి నుండి జరగనున్న బ్రహ్మోత్సవాలు 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి

Latest Interesting Telugu News Tsnews

For More New 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *