60 రోజుల్లో అమెరికాను వదిలివెళ్లాలి

LEAVE USA IN 60 DAYS

డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. అరవై రోజుల్లో హెచ్ 1 బీ వీసా మీద ఉన్న భారతీయుల్ని అరవై రోజుల్లో దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. లేకపోతే, వేరే సంస్థకు అయినా పూర్తి స్థాయి ఉద్యోగంలోకి మారిపోవాలని ఆదేశించాడు. దీంతో, అక్కడి కంపెనీలు ఉద్యోగ నియమాకాలు, నిలుపుదల వంటి అంశాల్ని పున:పరిశీలించే అవకాశమున్నది. అమెరికాలో నిరుద్యోగం మూడు వేల శాతం పెరిగిందని, సుమారు అరవై ఆరు లక్షల మంది నిరుద్యోగ ప్రయోజనాల్ని అందుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే అమెరికా ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా సెలవులను ప్రకటించింది. మరికొందరికేమో తక్కువ గంటలు పని చేసే వీలును కల్పించింది. దీనికి విరుద్ధంగా భారతీయ హెచ్-1 బీ ఉద్యోగులు పేరోల్ మీద 40 గంటలు అధికంగా పని చేయాల్సి వస్తున్నది. ఇందుకోసం ఒక్క డాలర్ కూడా అదనంగా చెల్లించడం లేదు. వాస్తవానికి, నాన్ ఇమ్మిగ్రెంట్ పర్మిట్ అయిన హెచ్1బీ యూస్ వీసా కార్యక్రమం వల్ల భారతీయులే అధిపెద్ద లబ్ధిదారులని చెప్పొచ్చు. అక్కడి కంపెనీల నిర్దిష్ఠ ఉద్యోగాల అవసరాల్ని తీర్చేందుకు విదేశాల్నుంచి నైపుణ్యం గల ప్రతిభావంతుల్ని ఎంచుకోవడానికి అక్కడి కంపెనీలకు అనుమతినిస్తుంది. దీంతో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భారత్ నుంచి ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి.

మూడు వంతులు మనవారే

అమెరికాలో హెచ్1బీ వీసా మీద ఉన్న వారిలో మూడో వంతు భారతీయ డాక్టర్లు, నర్సులు, ఐటీ నిపుణులే కావడం గమనార్హం. వారి ఉద్యోగాలు, ఆరోగ్య బీమా కోల్పోయే ప్రమాదం ఉందని అక్కడి ప్రభుత్వ సంస్థలే అంటున్నారు. ఈ వీసా గల ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి అరవై రోజుల్లో స్వదేశం వెళ్లిపోవడం కష్టమే. ఎందుకంటే, భారత్ తో సహా అనేక దేశాలు విదేశీ రాకపోకల్ని పూర్తిగా నిషేధించాయి. అందుకే, అమెరికాలో నివసిస్తున్న భారతీయ ఉద్యోగులు తమ ఉద్యోగ నష్ట పరిమితిని అరవై రోజుల్నుంచి 180 రోజులకు పెంచాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకోసం వైట్ హౌస్ వెబ్ సైటులో పిటిషన్ ప్రచారంపై ఇప్పటివరకూ 20 వేల మంది సంతకాలు చేశారు. దీనిపై వైట్ హౌజ్ స్పందించాలంటే కనీసం లక్ష మంది సంతకాలు అవసరం. కాబట్టి, ప్రతిఒక్కరం స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది.

H1B VISA UPDATES 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *