విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్షపై జపాన్ ఝలక్

Spread the love
Letter to AP Sarkar on the review of power contracts

ఏపీ సర్కార్ కు జపాన్ ఝలక్ ఇచ్చింది.  విద్యుత్ ఒప్పందాలపై అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి ఘాటు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ పీపీఏ ఒప్పందాలను సమీక్షిస్తామని ఏపీ సీఎం జగన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ సర్కారు హయాంలో భారీ ధరలకు పీపీఏలు కుదర్చుకోవడం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగిందని ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇటీవల కేంద్ర ఇంధన శాఖ అభ్యంతరం వ్యక్తం చేయగా, తాజాగా జపాన్ ఈ విషయమై తీవ్రంగా స్పందించింది. విద్యుత్ పీపీఏలను పున:సమీక్షించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని జపాన్ తెలిపింది. ఇప్పటికే మనుగడలో ఉన్న విద్యుత్ పీపీఏల జోలికి వెళ్లడం ఎందుకని ప్రశ్నించింది. భారత పునరుత్పాదక విద్యుత్ రంగంలో జపాన్ కు చెందిన ఎస్ బీ ఎనర్జీ, రెన్యూ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ దౌత్య కార్యాలయం ఈ విషయమై కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖలు రాసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *