ఇలాంటి తెలివితక్కువ పనులొద్దు

linemen dead due to mb pipes

కొన్నిసార్లు ప్రజల ముందుజాగ్రత్తల వల్ల కూడా ప్రజలు దుర్మరణం చెందుతుంటారు. కరోనా నేపథ్యంలో పలు సందర్భాల్లో అకాలంగా మరణిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం..

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా గ్రామాల ప్రజలు రోడ్లు మూసి వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో రోడ్డు ప్రమాదంలో విద్యుత్తు లైన్ మెన్ చింత రమేష్ (48) మృతి చెందారు. కొత్తకొండ, ధర్మారం గ్రామాల మధ్యలో మిషన్ భగీరథ పైపులు అడ్డంగా గ్రామస్తులు వేశారు. విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డుకు అడ్డంగా ఉన్న పైపుల్ని రమేష్ గమనించలేదు. వాటిని బైకుతో వేగంగా ఢీ కొట్టడంతో క్రిందపడి తలకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ ఎల్కతుర్తి మండలం జీలుగులలో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

నిర్బంధం అంటే మిమ్మల్ని ఇంట్లో ఉండండి అంటున్నారు కానీ, రోడ్లకు అడ్డుగా ముళ్ళకంపలు, మట్టి పోసి ,కంచెలు నాటి ఏదో చేసాం అనుకుంటే ఎమర్జెన్సీ సర్వీస్, అంబులెన్స్, పోలీస్, పాలు, అగ్నిమాపక వాహనాలు రాకపోకలు ఎలా?? రాగానే తీసేస్తాం అంటే రాత్రిళ్ళు అవసరం వస్తే ఎవడు వచ్చి తీస్తారు? ముళ్ల కంపలు, మట్టి??  జబ్బుతో, పురిటి నొప్పులో, హార్ట్ ఎటాక్ తో ఊర్లోని ఎవరికైనా వస్తే  ఇంటికి 108 వాహనాలు రాత్రిళ్ళు అయినా పగలు అయినా ఎలా వస్తాయి??  ఇలాంటి చెత్త పనులకు సమయం చాలక ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉంది, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడటం అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి, ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటే మంచిది.

telangana corona live 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *