మద్యం రేటు 50 శాతం పెంపుదల

Liquor Rates 50% Increased

మార్చి 22 నుంచి మద్యం దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు మందుబాబులు. వెయ్యి రూపాయలున్న బాటిల్ ఏడేనిమిది వేలు పెట్టి కొనుక్కున్నారు మరికొందరు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం బ్లాక్ దందా గణనీయంగా పెరిగింది. అయితే, కేంద్రం తీసుకున్న నిర్ణయాల ప్రకారం, ఏపీ ప్రభుత్వం మద్యం షాపులను సోమవారం తెరిచింది. దీంతో, వీటి వద్ద ప్రజల రద్దీ భారీగా పెరిగింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. సుమారు యాభై శాతం మద్యం ధరలను పెంచింది. సోమవారం మద్యం షాపుల వద్ద పెరిగిన రద్దీని తగ్గించేందుకు, మద్యం ధరలను భారీగా పెంచింది. మొత్తంగా 75శాతం మద్యం ధరలను పెంచినట్లు అయ్యింది. పెరిగిన ధర నేటి నుంచి అమలు చేస్తూ నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా మరో 15శాతం మద్యం దుకాణాల తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నదని సమాచారం.

APLatestNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *