కరోనా లాక్ డౌన్ సరిపోదు

lockdown is not enough

కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా భావిస్తున్న ప్రభుత్వాలు కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సీఎం జగన్ లాక్ డౌన్ చెయ్యాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ నేపధ్యంలో  ఏపీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయన్న బాబు కేవలం లాక్‌ డౌన్‌ తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని పేర్కొన్నారు.

ప్రజారోగ్య చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇప్పటికే విదేశాల నుంచి ఏపీలోకి 15 వేల మంది వచ్చారని సమాచారం ఉందని పేర్కొన్నారు. వారందరికీ కట్టుదిట్టంగా క్వారంటైన్‌ అమలు చేయాలని అన్నారు. కరోనా సోకిన వారి కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని, మార్కెట్‌లో నిత్యావసర ధరలను కట్టడి చేయాలని చంద్రబాబు జగన్ ను కోరారు. అయితే చంద్రబాబు ప్రస్తుతం తన హైదరాబాద్ నివాసంలో ఉన్నారు. లాక్ డౌన్ లో భాగంగా ఆయన కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి .

tags: coronavirus, corona pandemic, corona china, corona india, pm modi, fight cm jagan, chandrababu letter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *