జూన్ 30 వరకూ లాక్ డౌన్

Lockdown Till 30th June

భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ ను కేంద్రం జూన్ 30 వరకూ పొడిగించింది. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.  జూన్ 8 నుంచి ఆరంభమయ్యే మొదటి ఫేజులో ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలకు సంబంధించిన సంస్థలు, షాపింగ్​ మాళ్లు ​ తెరిచేందుకు అనుమతినిస్తారు. ఆయా ప్రదేశాల్లో పాటించాల్సిన నిబంధనలపై సంబంధిత శాఖలతో చర్చించి, త్వరలోనే మార్గదర్శకాల్ని కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేయనున్నది.

రెండో ఫేజులో..
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించాకే పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు తెరవడంపై తుది నిర్ణయానికొస్తారు. విద్యా సంస్థలు తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. సంబంధిత పక్షాల నుంచి వచ్చిన అభిప్రాయాల​ ఆధారంగా విద్యా సంస్థల్ని తెరవడంపై జులైలో నిర్ణయం తీసుకుంటారు.

మూడో ఫేజులో.. మూడో దశలో పరిమిత కార్యకలాపాలపై నిషేధం అమలు చేస్తారు. అవి.. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైల్, సినిమా హాళ్లు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్య/సాంస్కృతిక/మత పరమైన కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధిస్తారు. పరిస్థితి ఆధారంగా ఆయా కార్యకలాపాలు ప్రారంభించే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.

Lockdown 5.0 Guidelines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *