లోక్ సభ ఎన్నికలు

Spread the love

LOAKSABHA Elections  … ఢిల్లీ వేదికగా తెలంగాణా అభ్యర్థుల కసరత్తు

లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో హడావుడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన బిజెపి పార్టీ లోక్సభ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయనుంది. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. నేడు ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు తో భేటీ అయ్యి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు తెలంగాణ బిజెపి నాయకులు. లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని గెలిచి ఉనికి కోల్పోయిన బిజెపి రానున్న లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. టిఆర్ఎస్ పార్టీ 16 స్థానాలను సొంతం చేసుకున్నప్పటికీ కేంద్ర సహకారం లేకుంటే ఏం చేయలేదని లక్ష్మణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించి కేంద్రంలో మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేటి ఢిల్లీలోని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయలు భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చేయనున్నారు. ఒకపక్క షెడ్యూల్ విడుదల కావడంతో త్వరితగతిన అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా లోక్ సభ ఎన్నికల కార్యాచరణను బిజెపి నాయకులు రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *