ఖైదీ దర్శకుడిని లాక్ చేసిన తెలుగు నిర్మాతలు

1
lokesh kanagaraj
lokesh kanagaraj

lokesh kanagaraj

ఖైదీ.. కార్తీ హీరోగా నటించిన సినిమా. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. ఒకే రాత్రిలో జరిగే కథగా వచ్చిన ఖైదీని దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా డీల్ చేశాడు. బిగి సడలని స్క్రీన్ ప్లేతో యాక్షన్ థ్రిల్లర్ ను చూపించాడు. కేవలం ఒకే కాస్ట్యూమ్ లో కనపించే కార్తీ సైతం ఈ పాత్రకు ప్రాణం పోశాడు. ఈ సినిమాకు ముందే తొలి సినిమా మా నగరంతోనూ మెస్మరైజ్ చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇక ఖైదీతో అతను సాధారణ దర్శకుడు కాదు అని ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే విజయ్ వంటి సూపర్ స్టార్ అతనికి తర్వాతి అవకాశం ఇచ్చారు. విజయ్- లోకేష్ కాంబోలో రూపొందిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఖైదీ చూశాక అతనికి ఏకంగా కమల్ హాసన్ కూడా ఛాన్స్ ఇవ్వడం విశేషం. యస్.. విజయ్ తర్వాత లోకేష్ చేయబోయే సినిమా కమల్ తోనే అయితే అది భారతీయుడు -2  తర్వాత ఉంటుంది. పైగా ఈ సినిమాను కమల్ హాసనే నిర్మిస్తున్నాడు. అయితే ఈ టైమ్ లో లోకేష్ కు టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీస్ వారు లోకేష్ కు ఓ భారీ అమౌంట్ ను అడ్వాన్స్ గా ఇచ్చారు.

ప్రస్తుతం ఇతర భాషా దర్శకులకు తెలుగులో మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటికే ఇదే బ్యానర్ కన్నడ డైరెక్టర్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ ఇచ్చి ఉంది. అలాగే తమిళ్ దర్శకుడు అట్లీకి వైజయంతీ మూవీస్ అడ్వాన్స్ ఇచ్చి ఉంది. మోస్ట్ ప్రామిసింగ్ అనిపించుకుని.. మాస్ తో పాటు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించే సత్తా ఉన్న దర్శకులకు ఇలా తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో సైతం అడ్వాన్స్ లు అందుతున్నాయి. వారు ఎప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు అని చెప్పలేం. కానీ ఎప్పుడు స్టార్ట్ చేసినా.. ముందు అడ్వాన్స్ ఇచ్చిన వారికే సినిమా చేయాల్సి ఉంటుంది కదా. అదో అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తంగా లోకేష్ కనకరాజ్- మైత్రీ బ్యానర్ లో ఎప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇంకా తేలలేదు కానీ.. మైత్రీ మూవీస్ బ్యానర్ మాత్రం ఎవరూ ఊహించని స్టెప్ వేసింది.

tollywood news