మండలిలో లోకేష్ వర్సెస్ మినిస్టర్ అనీల్

Spread the love

Lokesh VS Minister ANIL

ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అటు అసెంబ్లీలోనూ ఇటు శాసన మండలిలోనూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడి వేడి మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈరోజు అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో జగన్ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, శాసనమండలిలో జరిగిన చర్చలో మాజీ మంత్రి నారా లోకేష్ కు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మధ్య వార్ నడిచింది.

ఈ ఉదయం శాసన మండలి సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రభసను సృష్టించాయి. 16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై అధికార సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. లోకేశ్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాతృభాష మాట్లాడటం రాని వారు కూడా మంత్రి పదవులు వెలగబెట్టారని, తాను పోటీకి నిలబడ్డ స్థానాన్ని మందలగిరి అని పిలిచిన వ్యక్తి లోకేశ్ అని, జయంతిని వర్థంతిగా మాట్లాడి అభాసుపాలయ్యాడని అన్నారు. ముందు తెలుగు నేర్చుకుని రావాలని, ఆయన తండ్రి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని నిప్పులు చెరిగారు. అర్ధరాత్రి పూట చిదంబరం వద్దకు వెళ్లి, ఆయన కాళ్లు పట్టుకున్న రోజులను మరచిపోయారా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదంతో సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పోయింది. గందరగోళం నెలకొంది.

NEWS UPDATES

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *