రసవత్తరంగా మంగళగిరి పోరు

LOKESH VS RK IN MANGALAGIRI

  • టీడీపీ నుంచి బరిలో లోకేశ్
  • సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లకే వైఎస్సార్ సీపీ టికెట్
  • నియోజకవర్గంలో ఆర్కేకి మంచి పేరు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి పోరు రసవత్తరం కానుంది. ఇక్కడ జరిగిన అభివృద్ధి దృష్ట్యా తన గెలుపు సులభమని భావించిన మంత్రి లోకేశ్.. మంగళగిరి నుంచి పోటీకి దిగారు. పైగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైఎస్సార్ సీపీ ఈసారి టికెట్ ఇవ్వదనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఇక మంగళగిరిలో తన గెలుపు చాలా సులభమనే భావనతో లోకేశ్ ఇక్కడ బరిలోకి దిగి, అప్పుడే ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే, ఇక్కడే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డికే టికెట్ కేటాయించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే లోకేశ్ షాక్ తిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆళ్ల వంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టాలంటే.. చెమడోడ్చక తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఆళ్లకి మంచి పేరుంది. సొంత డబ్బుతో వైఎస్సార్ క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు భోజనం పెడుతున్నారు. అంతేకాకుండా ఆయన నిరాడంబర శైలి, నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికీ దగ్గరివాడిగా, వారి ఇంట్లో ఒక సభ్యుడిగా ఆళ్ల మారిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతోనే గెలిచిన ఆర్కే.. తదనంతర కాలంలో ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో లోకేశ్ గెలవడం అంత సులభం మాత్రం కాదు. మరి ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *