విన్నర్స్ అనిపించుకుంటోన్న ‘లూజర్’

looser super

విజేతల కథలు ఎప్పుడూ ఉత్సాహాన్ని నింపుతాయి. కానీ పరాజితుల కథలు.. పడిపోయినా లేవడం ఎలాగో నేర్పుతాయి. ఓటమిని ఎలా దాటాలో చెబుతాయి. అలాంటి ముగ్గురి కథలతో వచ్చిన వెబ్ సిరీస్ లూజర్స్. ఈ మూడు కథలూ మూడు కాలాల్లో సాగుతూ ఒక్కో కథను మరో కథకు ముడివేస్తూ దర్శకుడు అభిలాష్ రూపొందించిన విధానం ఓటిటి ప్లాట్ ఫామ్ ఆడియన్స్ కు ఓ రేంజ్ లో నచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ వెబ్ సిరీస్ డిజిటల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఏ ఆటైనా ఆడితేనే గెలుపో ఓటమో తెలుస్తుంది. అయితే ఆడగలిగే సత్తా ఉండి.. కొందరి స్వార్థం, మరికొంత ఇతర వ్యవహారాల వల్ల అసలు బరిలోకి దిగేందుకే పోరాటం చేయాల్సి వస్తే.. ఇంక ఆ ఆటగాడు గెలిచినట్టా ఓడినట్టా అనేది ఎలా డిసైడ్ చేస్తాం.. మన దేశంలో స్పోర్ట్స్ అథారిటీస్ లో జరిగే వ్వవహారాలు చాలా వరకూ ఓపెన్ సీక్రెట్సే.

ఇలాంటి కొన్నిటి వల్లే కెరీర్ ను లాస్ అయిన 1980ల్లో ఫాస్ట్ బౌలర్ గా ఎదిగి అనూహ్యంగా టీమ్ లో చోటు కోల్పోయిన విల్సన్, సంప్రదాయాల మాటున ఆడవాళ్లు ఆడకూడదు అని చెప్పిన తండ్రిని ఒప్పించినా.. స్పోర్ట్స్ అథారిటీస్ లోని కొందరిని ఫేస్ చేయలేకపోయిన రూబీ, పేదరికం వల్ల ప్రతిభ ఉండీ.. డబ్బులు లేక రైఫిల్ షూటింగ్ టీమ్ లో ప్లేస్ కోల్పోయిన సూరియాదవ్.. ఈ ముగ్గురి కథ మనకు తెలిసిందే. అయినా అత్యంత వాస్తవికంగా చూపించాడు దర్శకుడు. ప్రతి కథా మన చుట్టే జరుగుతుందా అన్నంత నేచులర్ గా కనిపిస్తుంది. వాళ్లు ఎదుర్కొనే స్ట్రగుల్స్ మనవేనా అనిపిస్తుంది. అందుకే ఈ సిరీస్ టైటిల్ కు భిన్నంగా విన్నర్ అనిపించుకుంటోంది.  ప్రధాన పాత్రల్లో నటించిన శశాంక్, ప్రియదర్శి, అనీ, కల్పిక స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ప్రతి సిరీస్ లోనూ దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. మామూలుగా వెబ్ సిరీస్ లు అనగానే కనిపించే అడల్ట్ కంటెంట్ కు దూరంగా ప్యూర్ స్టోరీస్ తో హార్ట్ ఫుల్ గా మెప్పిస్తోందీ సిరీస్. మొదట్లో కాస్త స్లోగా అనిపించినా.. ఆ తర్వాత చాలా ఫాస్ట్ గా సాగుతూ.. ఆకట్టుకుంటోంది.. ఇలాంటి కంటెంట్స్ కు ఆదరణ ఉంటే తెలుగులోనూ చాలామంచి కథలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో వెలుగు చూస్తాయని చెప్పొచ్చు.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *