చందానగర్ లో పరువు హత్య?

6
Lover Killed In ChandaNagar
chanda nagar lover murder

Lover Killed In ChandaNagar

ప్రేమించి పెళ్లి చేసున్న యువ జంట పై యువతి తండ్రి యువకుడిని అతి కిరాతంగా హత్య చేయించిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. చందానగర్ లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఆదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని ఇష్ట పడని యువతి తండ్రి కిరాయి గుండాలతో యువకుడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డి లో హత్య చేయించాడని సమాచారం. ఈ యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలి పీయస్ లో కిడ్నాప్ కేసు నమోదు కాగా.. చందానగర్ పీయస్ లో మిసింగ్ కేసు నమోదు అయ్యింది. సంగారెడ్డి లో హత్య కేసును పోలీసులు నమోదు చేశారు.

chanda nagar lover murder