గుడ్ న్యూస్ చెప్పిన బడ్జెట్

Spread the love

Low Interest rates on Home Loans

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పన్నుచెల్లింపు దారులకు గుడ్ న్యూస్. కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ ఐటీ రిటర్న్స్ చెల్లించేవారికి ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు.ఇక నుంచి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో PAN కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డు ఒకటి సమర్పిస్తే చాలు. ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా పాన్ కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఫైనాన్షియల్ వ్యవహారాల్లో పాన్ కార్డును కూడా చూపించాల్సిందే. సంబంధిత పత్రాల్లో పాన్ కార్డును జతచేయాల్సి వస్తోంది. ప్రత్యేకించి ఆదాయ పన్ను శాఖకు చెల్లించే పన్నులో కూడా పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల వార్షిక బడ్జెట్ ప్రసంగంలో.. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు పాన్ కార్డు అవసరం లేదని చెప్పారు. గుర్తింపు కార్డు ఆధార్ కార్డు ఒకటి సమర్పిస్తే చాలుని ఆమె తెలిపారు.

మధ్యతరగతి వారిపై కేంద్రం కరుణ చూపించింది. గృహ రుణాలపై ఇంకాస్త ఊరట లభించింది. వడ్డీ రాయితీ రూ. 2 లక్షల నుంచి రూ. 3.50 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2019-20 బడ్జెట్‌ను లోక్ సభలో ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోమ్ లోన్‌పై కీలక ప్రకటన చేశారు. రూ. 45 లక్షల గృహ రుణం తీసుకున్న వారికి రూ. 3.5 లక్షల వడ్డీ రాయితీస్తున్నట్లు ప్రకటించారు. గృహ రుణం తీసుకున్న వారికి అదనంగా మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఇస్తామని వెల్లడించారు. పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తామని చెప్పిన మంత్రి నిర్మలా సీతారామన్.. కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధి రూ.400కోట్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.100 లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు.

ఇక బ్యాంకు అకౌంట్ నుంచి ఏడాదిలో రూ. కోటి డ్రా చేస్తే 2 శాతం పన్ను విధిస్తామన్నారు. గత ఐదేళ్లలో ప్రత్యక్ష పన్నుల ఆదాయం 78 శాతం పెరిగిందని చెప్పారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా 11.37 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు సభకు తె లిపారు. రూ. 400 కోట్ల టర్నోవర్ దాటితే కంపెనీలకు 25 శాతం కార్పొరేట్ టాక్స్ విధించనున్నట్లు..99.3 శాతం కంపెనీలకు వర్తిస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *